iDreamPost
android-app
ios-app

వీడియో: తిలక్ వర్మ సిక్సుల మోత.. తెలుగోడి దెబ్బకు దద్దరిల్లిన స్టేడియం

  • Published Mar 18, 2024 | 8:46 PM Updated Updated Mar 18, 2024 | 8:46 PM

Tilak Varma: ఐపీఎల్ 2024 సీజన్ కోసం అన్ని టీమ్స్ హోరాహోరీగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు.

Tilak Varma: ఐపీఎల్ 2024 సీజన్ కోసం అన్ని టీమ్స్ హోరాహోరీగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు.

  • Published Mar 18, 2024 | 8:46 PMUpdated Mar 18, 2024 | 8:46 PM
వీడియో: తిలక్ వర్మ సిక్సుల మోత.. తెలుగోడి దెబ్బకు దద్దరిల్లిన స్టేడియం

ప్రస్తుతం అందరి దృష్టి క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2024 ఎడిషన్ మీదే ఉంది. ఇప్పటికే అన్ని టీమ్స్ హోం గ్రౌండ్స్ కి చేరుకుని కసరత్తు మొదలు పెట్టేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలా స్టార్ ప్లేయర్స్ అందరూ తమ క్యాంప్స్ కి చేరుకున్నారు. మరోవైపు అన్ని టీమ్స్ సీజన్ కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లు అందరూ నెట్స్ లో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఫ్రాచైజెస్ కూడా వారి ప్లేయర్స్ ప్రాక్టీస్ ని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ పోస్ట్ చేసిన తిలక్ వర్మ విజృంభణకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఎంఐ ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు.

తిలక్ వర్మ నెట్స్ లో చమటోడుస్తున్నాడు. బౌలర్లు వేస్తున్న పదునైన బంతులను భారీ సిక్సులుగా మలుస్తున్నాడు. బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ పర్యవేక్షణలో, అతని విలువైన సలహాలు తీసుకుంటూ తిలక్ వర్మ విజృంభిచాండు. అన్ని రకాల షాట్స్ తో దుమ్మురేపాడు. స్టెప్ అవుట్ అవ్వడం, రివర్స్ స్వీప్ అంటూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తిలక్ వర్మ బ్యాట్ నుంచి వస్తున్న ఒక్కో షాట్ కు స్టేడియం మొత్తం రీసౌండింగ్ వచ్చింది. ఒక్కో షాట్ ఒక్కో డైమండ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి తిలక్ వర్మ తన బ్యాటుకు పని చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు అంటున్నారు. ముంబయికి అద్భుతమైన విజయాలు అందించేందుకు తిలక్ వర్మ ప్రిపేర్ అవుతున్నాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

తిలక్ వర్మ పర్పార్మెన్స్:

ఐపీఎల్ లో తిలక్ వర్మ రిమార్కబుల్ బ్యాటింగ్ తో దూసుకెళ్తున్నాడు. 2022 సీజన్లో తిలక్ వర్మ అరంగేట్రం చేశాడు. ముంబయి ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ మొత్తం 25 మ్యాచుల్లో పాల్గొన్నాడు. ఈ మ్యాచుల్లో మొత్తం 740 పరుగులు చేశాడు. వాటిలో 3 అర్ధ శతకాలు ఉన్నాయి. తిలక్ వర్మకు 144.53 స్ట్రైక్ రేటు ఉంది. తెలుగోడి అదిరిపోయే ప్రదర్శనకు టీమిండియా అభిమానులు అంతా ఫిదా అయిపోయారు. అదే ప్రదర్శనతో తిలక్ వర్మ ఇండియన్ జెర్సీ కూడా ధరించాడు. టీ20, వన్డే మ్యాచుల్లోకి తిలక్ వర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో భారత్ తరఫున 15 ఇన్నింగ్స్ లలో తిలక్ వర్మ 139.42 స్ట్రైక్ రేట్ తో 336 పరుగులు చేశాడు. వాటిలో 2 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ గణాంకాలు తిలక్ వర్మ సత్తా ఏంటో తెలిసేలా చేస్తున్నాయి. ఈసారి సీజన్ లో కూడా ముంబయి ఇండియన్స్ తరఫున ఈ యంగ్ స్టర్ అద్భుతమైన ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆకాంక్షలకు నిదర్శనంగా ప్రస్తుతం తిలక్ వర్మ ప్రాక్టీస్ వీడియో మారుతోంది. మరి.. తిలక్ వర్మ సిక్సుల జోరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom