SNP
SNP
తెలుగు తేజం తిలక్ వర్మ వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. గాయాన వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. తిలక్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు మొత్తం దారుణంగా విఫలమైనా తిలక్ మాత్రం సూపర్ బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. తొలి మ్యాచ్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలిచిన తిలక్.. ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ తిలక్‌కు రెండో అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ అరుదైన ఫిఫ్టీని తిలక్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తికి అంకితం ఇచ్చాడు. తనెవరో కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరా.
ఐపీఎల్‌లో గత రెండేళ్లుగా ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న తిలక్ వర్మకు రోహిత్ శర్మ మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే రోహిత్‌కు సైతం తిలక్ అంటే ఎంతో ప్రేమ. సొంత తమ్ముడిలా చూస్తుంటాడు. అందుకే తిలక్‌కు రోహిత్ ఫ్యామిలీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా రోహిత్ గారాలా పట్టీ సమైరాకు తిలక్ మంచి ఫ్రెండ్ కూడా. ఐపీఎల్ సందర్భంగా వీరిద్దరూ చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారంటా. సమైరాతో టైమ్ స్పెండ్ చేయడం తిలక్‌కు చాలా ఇష్టం. సమైరా సైతం తిలక్‌తో కలిసి ఆడుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుందటా.. ఇలా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఓ సారి తిలక్ సమైరాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ కానీ, సెంచరీ కానీ చేస్తే ఫస్ట్ తనతోనే సెలబ్రేట్ చేసుకుంటానని మాట ఇచ్చాడంటా.. అందుకే వెస్టిండీస్‌పై హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే.. తిలక్ ఎంతో కూల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. థంబ్ చూపిస్తూ.. సమైరాకు తన హాఫ్ సెంచరీని డెడికేట్ చేశాడు. కాగా, తిలక్ వర్మ హాఫ్ సెంచరీ తర్వాత చేసుకున్న కూల్ సెలబ్రేషన్స్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టడం విశేషం. మరి తిలక్ వర్మ-సమైరా బాండింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tilak Varma kept his promise to the daughter of Rohit Sharma.
A beautiful bond in MI family….!!!!! pic.twitter.com/fCXfRpDJe2
— Johns. (@CricCrazyJohns) August 7, 2023
Instagram story by Captain Rohit Sharma.
Tilak Varma dedicated the celebration after fifty to the daughter of Rohit. pic.twitter.com/gmxuh4MHTb
— Johns. (@CricCrazyJohns) August 7, 2023
ఇదీ చదవండి: రోహిత్ శర్మ తర్వాత మన వర్మే! తిలక్ ఖాతాలో అరుదైన రికార్డు