iDreamPost

ఇంగ్లాండ్ పై సూపర్ సెంచరీ.. రచిన్ రవీంద్ర ట్రూ స్టోరీ

ఇంగ్లాండ్ పై సూపర్ సెంచరీ.. రచిన్ రవీంద్ర ట్రూ స్టోరీ

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ 09 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించి ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 09 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి న్యూజీలాండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర మెరుపు బ్యాటింగ్ తో విరుచుకు పడ్డారు. వీరిద్దరి విధ్వసంకర బ్యాటింగ్ దాటికి 82 బంతులు మిగిలుండగానే గ్రాండ్ విక్టరీ కొట్టింది. కాగా ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీతో అదరగొట్టి నాటౌట్ గా నిలిచిన రచిన్ రవీంద్ర ట్రూ స్టోరీ గురించి తెలుసుకుందాం.

భారత సంతతికి చెందిన కివీస్ క్రికెటర్ రచిన్ రవీంద్ర తన మొట్టమొదటి ప్రపంచ కప్ మ్యాచ్‌ లో 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగి 123 పరుగులు చేసాడు. తన బ్యాటింగ్ తో నిప్పులు చెరుగుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రపంచ కప్ లో తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. అయితే రచిన్ రవీంద్ర పేరు వెనుక ఓ కథ ఉంది. భారత్ లెజండరీ క్రికెటర్లైన రాహుల్ ద్రావిడ్, సచిన్ పేర్లలోని అక్షరాలను కలిపి రచిన్ గా నామకరణం చేశారు ఆయన తండ్రి. దీనికి గల కారణం ఏంటంటే.. రచిన్ తండ్రి రవీంద్ర కృష్ణమూర్తి బెంగళూరులో జన్మించారు.

ఆయనకు క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. భారత దిగ్గజ ఆటగాళ్లైన రాహుల్ ద్రవిడ్ మరియు సచిన్ టెండూల్కర్‌లకు వీరాభిమాని రచిన్ తండ్రి. ఈ కారణంగానే రచిన్ జన్మించినప్పుడు, అతని తండ్రి తన అభిమాన క్రికెటర్ల పేర్లతో తన కొడుకుకు పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా భారత క్రికెట్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరులోంచి RA అక్షరాలను, అదే విధంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరులోంచి CHIN అక్షరాలను తీసుకొని ఆ రెండింటిని కలిపి రచిన్ రవీంద్రగా పేరు పెట్టాడు. రచిన్ రవీంద్ర తన మెరుగైన ఆటతీరుతో న్యూజీలాండ్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి