Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ ఇంట్లో దొంగతనం.. భారీగా క్యాష్‌, నగలు చోరీ

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ ఇంట్లో దొంగతనం చోటు చేసుకుంది. భారీగా నగదు చోరీ చేసినట్లు తెలిసింది. ఆ వివరాలు..

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ ఇంట్లో దొంగతనం చోటు చేసుకుంది. భారీగా నగదు చోరీ చేసినట్లు తెలిసింది. ఆ వివరాలు..

సామాన్యుల ఇళ్లనే అంటే.. సెలబ్రిటీలు, ఆఖరికి పోలీసు అధికారుల ఇళ్లను సైతం వదలడం లేదు దొంగలు. కామన్‌ మ్యాన్‌ ఇంటికి కన్నం వేస్తే ఏం దొరుకుతుంది.. మహా అయితే చేతి ఖర్చులకు లభిస్తాయేమో.. అదే సెలబ్రిటీ ఇళ్లల్లో చోరీలు చేశామంటే.. భారీగా సొత్తు లభిస్తుంది.. వెంటనే వైరల్‌ అవుతామని భావిస్తున్నారేమో దొంగలు. అందుకే ఈ మధ్య కాలంలో ప్రముఖుల ఇళ్లనే టార్గెట్‌ చేసి.. చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్‌ గంగులీ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేటుగాళ్లు.. తాజాగా యువరాజ్‌ సింగ్‌ ఇంటికి కన్నం వేశారు. భారీగా నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. ఆ వివరాలు..

టీమిండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ ఇంట్లో దొంగతనం జరిగింది. హరియాణా పంచ్​కులలోని యువరాజ్‌ ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఈ క్రమంలో రూ. 75వేల నగదుతో పాటు ఎంతో విలువ చేసే ఆభరణాలను చోరీ చేశారు. అయితే ఇంట్లో పనిచేసే సిబ్బందే.. ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ చోరీ జరిగింది ఇప్పుడు కాదు. గతేడాది అనగా.. 2023, అక్టోబర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువరాజ్​ సింగ్​ తల్లి షబ్నమ్​ సింగ్​.. 2023 సెప్టెంబర్​లో గుర్​గావ్​లోని మరో ఇంటికి వెళ్లి.. అక్టోబర్​ 5న.. పంచ్​కులలోని ఎండీసీ సెక్టార్​ 4లో ఉన్న ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడే ఈ దొంగతనం జరిగినట్లు ఆమె గుర్తించారు.

యువరాజ్​ ఇంట్లో దొంగతనం జరిగిందని, రూ. 75వేల నగదు, ఎంతో విలువ చేసే నగలు కనిపించడం లేదని షబ్నమ్‌ గుర్తించారు. అయితే ఇంట్లో పని చేసే వారే ఈ దొంగతానికి పాల్పడి ఉంటారని అనుమానించిన షబ్నమ్‌.. వారిని పట్టుకోవడం కోసం ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆమెకు పంచ్‌కుల ఇంట్లో పని చేసే హౌజ్​ కీపింగ్​ స్టాఫ్​ లలితా దేవి, సిల్దార్​ పాల్​పై అనుమానం మొదలైంది. దాంతో ఎంతో జాగ్రత్తగా వారి కదలికలను గమనించసాగారు. కానీ ఎలాంటి ఆధారం లభించలేదు.

తనే తప్పుగా వారిని అనుమానించానేమో అని భావించారు షబ్నామ్‌. ఇంతలో దీపావళి వచ్చింది. లలితా దేవి, సిల్దార్​ పాల్​లు.. హఠాత్తుగా ఉద్యోగాలు వదిలేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో వారిద్దరే యువరాజ్​ ఇంట్లో దొంగతనం చేసి ఉంటారన్న యువరాజ్​సింగ్​ తల్లి అనుమానాలు మరింత బలపడ్డాయి. వెంటనే పోలీస్​ స్టేషన్​కు వెళ్లి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకే ఈ విషయాన్ని ఇంతకాలం గుట్టుగా ఉంచినట్టు పోలీసులు వెల్లడించారు. మరి ఇంతకు యువరాజ్‌ ఇంట్లో దొంగతనానికి పాల్పడింది వారిద్దరనే.. లేదా.. అసలు దొంగలను పట్టుకున్నారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆరు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి రావడం ఆశ్చర్యకరంగా మారింది.

కాగా.. కొన్ని రోజుల క్రితం టీమిండియా మాజీ సారథి సౌరవ్​ గంగూలీ ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన మొబైల్‌ ఫోన్‌ చోరీ చేశారు. ఇక దొంగతనం జరిగినప్పుడు.. గంగూలీ ఇంట్లో లేరు. ఇంట్లోనే దానిని వదిలి బయటకు వెళ్లినట్టు, తిరిగి వచ్చి చూసేసరికి లేదని ఫోన్‌ కనిపించ లేదని ఆయన పోలీసులకు తెలిపారు. కాగా.. గంగూలీ ఇంట్లో ఆ సమయంలో పెయింటింగ్​ వర్క్​ జరిగింది. పెయింటింగ్​ వేసేందుకు వచ్చిన వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Show comments