ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్.. లైవ్​ స్ట్రీమింగ్ అందులోనే!

Team India Parade: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి పయనమయ్యారు టీమిండియా ప్లేయర్లు. మరికొన్ని గంటల్లో ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. దీని లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Team India Parade: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి పయనమయ్యారు టీమిండియా ప్లేయర్లు. మరికొన్ని గంటల్లో ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. దీని లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్ కప్-2024ను గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. బెరిల్ తుఫాను కారణంగా కరీబియన్ దీవుల్లోనే ఉండిపోయారు. అయితే అక్కడ పరిస్థితులు మెరుగుపడటంతో భారత క్రికెట్ బోర్డు ఓ స్పెషల్ ఫ్లైట్​ను బార్బడోస్​కు పంపించింది. ఈ ప్రత్యేక విమానంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర ఆటగాళ్లు, కోచింగ్-సపోర్టింగ్ స్టాఫ్, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబసభ్యులు ఇండియాకు బయల్దేరారు. మంగళవారం రాత్రి వాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కానున్నారు. రేపు టీమిండియా ప్లేయర్లకు టైట్ షెడ్యూల్ ఉండనుంది. ఉదయం 9.30 గంటలకు ఆటగాళ్లందరూ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి బయల్దేరుతారు. మోడీని కలిసి వరల్డ్ కప్ జర్నీ విషయాలను షేర్ చేసుకోనున్నారు.

ప్రధాని మోడీతో బ్రేక్​ఫాస్ట్ తర్వాత స్పెషల్ ఫ్లైట్​లో ముంబై చేరుకోనున్నారు భారత ఆటగాళ్లు. ఎయిర్​పోర్ట్ నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి వస్తారు. ఈ క్రమంలో వాంఖడేకు దగ్గరల్లో రెండు కిలోమీటర్ల మేర నిర్వహించే ఓపెన్ బస్ విక్టరీ పరేడ్​లో టీమిండియా ప్లేయర్లు అందరూ ప్రపంచ కప్ ట్రోఫీతో సందడి చేయనున్నారు. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో నిర్వహించే ప్రోగ్రామ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని బోర్డు సెక్రెటరీ జైషాకు అందజేస్తారు. ఇది ముగిసిన తర్వాత ఆటగాళ్లు తమ ఇళ్లకు అక్కడి నుంచి పయనమవుతారు. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని స్టార్ స్పోర్ట్స్ టెలికాస్ట్ చేయనుంది. వరల్డ్ ఛాంపియన్స్ పరేడ్ పేరుతో రేపు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది.

టెలివిజన్​లో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానెల్​లో టీమిండియా విక్టరీ పరేడ్​ను చూడొచ్చు. అదే డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటే డిస్నీప్లస్ హాట్​స్టార్ ఓటీటీలో దీన్ని లైవ్​గా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక, విక్టరీ పరేడ్ గురించి సారథి రోహిత్ శర్మ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బార్బడోస్ నుంచి బయల్దేరిన నేపథ్యంలో హిట్​మ్యాన్ ట్వీట్ చేశాడు. వరల్డ్ కప్​తో భారత్​కు తిరిగొస్తున్నామని.. ఈ సంతోషాన్ని అందరితో కలసి పంచుకోవాలని ఎదురు చూస్తున్నానని అన్నాడు. అభిమానులంతా వాంఖడే స్టేడియానికి రావాలని.. రేపు 5 గంటలకు విక్టరీ పరేడ్ ఉంటుందని తెలిపాడు హిట్​మ్యాన్. ప్రపంచ కప్ విజయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుందామని అభిమానులకు అతడు పిలుపును ఇచ్చాడు. మరి.. ఈ పరేడ్​ను చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments