iDreamPost
android-app
ios-app

Rohit-Kohli: రోహిత్-కోహ్లీ రిటైర్మెంట్​పై షమి రియాక్షన్.. అసలు సవాల్ అదేనంటూ..!

  • Published Jul 03, 2024 | 6:05 PM Updated Updated Jul 03, 2024 | 6:05 PM

టీమిండియాకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 క్రికెట్​కు వాళ్లిద్దరూ గుడ్​బై చెప్పారు.

టీమిండియాకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 క్రికెట్​కు వాళ్లిద్దరూ గుడ్​బై చెప్పారు.

  • Published Jul 03, 2024 | 6:05 PMUpdated Jul 03, 2024 | 6:05 PM
Rohit-Kohli: రోహిత్-కోహ్లీ రిటైర్మెంట్​పై షమి రియాక్షన్.. అసలు సవాల్ అదేనంటూ..!

భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్​-2024ను కైవసం చేసుకోవడంతో కోట్లాది మంది భారతీయులు సంతోషంలో మునిగిపోయారు. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్పు దరిచేరడంతో టీమిండియా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. క్రాకర్స్ కాలుస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వాళ్లు వ్యక్తం చేశారు. కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కప్పు అందుకోవడంతో అభిమానులు సంతోషం పట్టలేకపోయారు. ఇద్దరు దిగ్గజాలు కప్పుతో కలసి దిగిన ఫొటోలు, వీడియోలను చూస్తూ ఫైనల్ రోజు రాత్రి ఎవరూ నిద్రపోలేదు. ఆ రోజు దేశం మొత్తం సెలబ్రేషన్స్​లో మునిగింది. అయితే ఒకవైపు గెలుపును ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రోహిత్-కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో ఎమోషనల్ అయ్యారు.

టీమిండియాకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 క్రికెట్​కు వాళ్లిద్దరూ గుడ్​బై చెప్పారు. వరల్డ్ కప్ గెలిచిన రోజే వీళ్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వీళ్లతో పాటు ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్​కు వీడ్కోలు చెప్పేశాడు. దీంతో కప్పు గెలిచామని ఒకవైపు సంతోషిస్తూనే.. ఇక మీదట ఈ లెజెండ్స్​ను టీ20ల్లో చూడలేమనే వార్తను తట్టుకోలేక నిరాశకూ లోనయ్యారు ఫ్యాన్స్. ఈ విషయంపై తాజాగా రియాక్ట్ అయ్యాడు వెటరన్ పేసర్ మహ్మద్ షమి. రోకో జోడీ రిటైర్మెంట్ న్యూస్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. వాళ్లిద్దరూ టీ20లకు గుడ్​బై చెబుతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు. వాళ్లిద్దరి లోటును పూడ్చడం అంత ఈజీ కాదన్నాడు షమి.

‘టీ20 క్రికెట్​కు రోహిత్-కోహ్లీ వీడ్కోలు చెబుతారని నేను ఊహించలేదు. ఇండియన్ క్రికెట్​ను వాళ్లిద్దరూ ఎంతో పటిష్టమైన స్థితిలో ఉంచారు. దశాబ్దంన్నరగా సూపర్బ్ పెర్ఫార్మెన్స్​తో ఫ్యాన్స్​ను అలరించారు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో టీమ్​ను అత్యున్నత శిఖరాలకు చేర్చారు. అలాంటిది ఇద్దరూ ఒకేసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు. వాళ్లిద్దరి స్థానాలను భర్తీ చేయడం అంత ఈజీ కాదు. టీమ్ మేనేజ్​మెంట్​కు ఇది కఠిన సవాల్ కానుంది. రోకో జోడీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేశారు. వాళ్లిద్దరి సేవలకు కృతజ్ఞతలు’ అని షమి చెప్పుకొచ్చాడు. రోహిత్-కోహ్లీలను రీప్లేస్ చేయడం కష్టమని.. ఈ ఛాలెంజ్​కు దాటితే టీమిండియాకు తిరుగుండదన్నాడు షమి. ఒక ఎరా ముగిసిందని, ఇక మీదట జట్టు బాధ్యతల్ని యువతరం మోయాలన్నాడు. మరి.. రోకో లేకున్నా భారత్ విజయాల బాటను విడవదని మీరు భావిస్తే కామెంట్ చేయండి.