iDreamPost
android-app
ios-app

IPLలో అట్టర్ ఫ్లాప్.. అయినా వరల్డ్ కప్ టీమ్​కు వైస్ కెప్టెన్.. హార్దిక్​పై నమ్మకానికి కారణాలివే!

  • Published Apr 30, 2024 | 8:20 PM Updated Updated Apr 30, 2024 | 8:20 PM

భారత టీ20 వరల్డ్ కప్ టీమ్​ను ఇవాళ ప్రకటించారు. అయితే ఎవరి అంచనాలకు అందని విధంగా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమ్ వైస్ కెప్టెన్సీ పోస్ట్ దక్కింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ మీద బోర్డు నమ్మకానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత టీ20 వరల్డ్ కప్ టీమ్​ను ఇవాళ ప్రకటించారు. అయితే ఎవరి అంచనాలకు అందని విధంగా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమ్ వైస్ కెప్టెన్సీ పోస్ట్ దక్కింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ మీద బోర్డు నమ్మకానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 30, 2024 | 8:20 PMUpdated Apr 30, 2024 | 8:20 PM
IPLలో అట్టర్ ఫ్లాప్.. అయినా వరల్డ్ కప్ టీమ్​కు వైస్ కెప్టెన్.. హార్దిక్​పై నమ్మకానికి కారణాలివే!

టీ20 వరల్డ్‌ కప్ జట్టు ప్రకటన గురించి క్రికెట్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. టీమిండియా అనే కాదు ఇతర జట్ల విషయంలోనూ అందరిలోనూ ఎగ్జయిట్​మెంట్ నెలకొంది. అయితే భారత జట్టు ఎంపిక మాత్రం ఇతర టీమ్స్ కంటే ఇంకా ఎక్కువ అటెన్షన్ తీసుకుంది. దీనికి కారణం ప్రస్తుత క్రికెట్​లోని టాప్ స్టార్స్​లో ఎక్కువ మంది టీమిండియాలో ఉండటమే. నిన్నటి నుంచి వరల్డ్ కప్ స్క్వాడ్స్ ప్రకటన మొదలైంది. తొలుత న్యూజిలాండ్, ఆ తర్వాత సౌతాఫ్రికా, అనంతరం ఇంగ్లండ్ తమ ప్రపంచ కప్ జట్లను ప్రకటించాయి. పొట్టి కప్పులో ఆడే భారత జట్టు ఏదో కూడా ఇవాళ క్లారిటీ వచ్చేసింది. బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ టీమ్​ను అనౌన్స్ చేసింది. అయితే ఆ జట్టుకు హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ చేయడంతో అందరూ షాకయ్యారు.

భారత వరల్డ్ కప్ జట్టులో మిగతా వాళ్ల సెలెక్షన్ ఎలా ఉన్నా హార్దిక్ వైస్ కెప్టెన్సీ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. చెత్తాటతో విమర్శల పాలవుతున్న అతడు.. ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా? లేదా? కూడా అనుమానంగా మారింది. ఈ ఐపీఎల్​లో హార్దిక్ 9 మ్యాచుల్లో 197 రన్స్ చేసి 4 వికెట్లే తీశాడు. దీంతో అతడు అక్కర్లేదు.. ఆ ప్లేసులో ఇతర యంగ్​స్టర్స్​కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో టీమ్ అనౌన్స్​ చేసిన బీసీసీఐ.. పాండ్యాను జట్టులోకి తీసుకుంది. అతడికి బెర్త్ ఇవ్వడమే గాక ఏకంగా వైస్ కెప్టెన్​గానూ ప్రమోషన్ ఇచ్చింది. దీంతో బోర్డు ఎందుకిలా చేసింది? బీసీసీఐ పెద్దలకు అసలు ఏమైంది? ఏం చూసి హార్దిక్​కు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు? టీమ్​లో చోటు ఇవ్వడమే గొప్ప అంటే ఇంకా వైస్ కెప్టెన్సీ కూడానా? అంటూ విమర్శకులు విరుచుకుపడుతున్నారు. అయితే నిశితంగా గమనిస్తే హార్దిక్ మీద బోర్డు నమ్మకం ఉంచడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా టీమ్​లో హార్దిక్ రెగ్యులర్ ప్లేయర్ అనేది తెలిసిందే. గాయాలతో దూరమైనప్పుడు తప్పితే ప్రతి సిరీస్​లోనూ అతడు టీమ్​లో భాగంగా ఉన్నాడు. సింగిల్ హ్యాండ్​తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో హ్యూజ్ ఎక్స్​పీరియెన్స్ ఉండటం అతడికి ప్లస్ అయింది. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో పాండ్యాకు తెలిసి ఉండటం కలిసొచ్చింది. గతంలో ప్రెజర్ సిచ్యువేషన్స్​లో నుంచి టీమ్​ను ఒడ్డున పడేసిన ట్రాక్ రికార్డు ఉండటం సెలెక్టర్లకు మరింత భరోసాను ఇచ్చింది. రోహిత్​ వారసుడిగా ఫ్యూచర్ టీ20 టీమ్ కెప్టెన్​గా ముందు నుంచి అతడ్ని ప్రిపేర్ చేశారు. అందుకే ఐపీఎల్​లో ఫెయిలైనా హార్దిక్​పై నమ్మకం ఉంచి ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించారు. పాండ్యా మీద కోచ్ ద్రవిడ్, బీసీసీఐ పెద్దలకు ఉన్న గురి కారణంగా అతడికి వైస్ కెప్టెన్సీ పోస్ట్ దక్కింది. మరి.. హార్దిక్​ను వైస్ కెప్టెన్ చేయడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.