iDreamPost
android-app
ios-app

Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌! ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్‌గా..

  • Published Jan 24, 2024 | 4:58 PM Updated Updated Jan 24, 2024 | 4:58 PM

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్​లో ఆ ఫీట్ నమోదు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్లేయర్​గా నిలిచాడు.

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్​లో ఆ ఫీట్ నమోదు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్లేయర్​గా నిలిచాడు.

  • Published Jan 24, 2024 | 4:58 PMUpdated Jan 24, 2024 | 4:58 PM
Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌! ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్‌గా..

టీమిండియాలో తక్కువ టైమ్​లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. ధనాధన్ ఇన్నింగ్స్​తో షార్ట్ టైమ్​లో స్టార్ ప్లేయర్ హోదా తెచ్చుకున్నాడు. అతడికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్​లో భారత్ తరఫున దుమ్మురేపుతూనే అటు ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​ తరపునా అదరగొడుతున్నాడు. టీమిండియాలో టీ20లు అనగానే మిస్టర్ 360నే అందరికీ గుర్తుకొస్తాడు. పొట్టి ఫార్మాట్​లో సూర్య భాయ్ ఆట అలా ఉంటుంది మరి. ప్రత్యర్థి ఎవరైనా, అవతల ఉన్నది ఎలాంటి బౌలర్ అయినా పట్టించుకోకుండా టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. ఫామ్​లో ఉంటే ఈ మిడిలార్డర్ బ్యాట్స్​మన్​ను ఆపడం ఎంతటి బౌలర్​కు అయినా కష్టమే. అంతాగా టీ20 క్రికెట్​ మీద తన మార్క్ వేశాడతను. అలాంటి సూర్య ఇప్పుడు చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్​లో ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును క్రియేట్ చేశాడు.

టీ20 క్రికెట్​లో సూర్యకుమార్ ప్రతాపానికి ఐసీసీ తగిన గుర్తింపును ఇచ్చింది. వరుసగా రెండో సంవత్సరం అతడ్ని టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​ అవార్డుకు సెలక్ట్ చేసింది. దీంతో అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20ల్లో రెండుసార్లు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​ పురస్కారాన్ని నెగ్గిన మొట్టమొదటి క్రికెటర్​గా సూర్య రికార్డు నెలకొల్పాడు. 2022లోనూ అతడు ఈ అవార్డు అందుకున్నాడు. గతేడాది పొట్టి ఫార్మాట్​లో 17 ఇన్నింగ్స్​ల్లో 48.86 యావరేజ్​, 155.95 స్ట్రయిక్ రేట్​తో 733 పరుగులు చేశాడు సూర్య. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో.. ఆసీస్, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​ల్లో భారత జట్టు కెప్టెన్​గానూ వ్యవహరించాడు. దీంతో అతడ్ని టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్​కు కెప్టెన్​గానూ నియమించింది ఐసీసీ.

ఇప్పుడంటే టీమిండియాలో స్టార్ ప్లేయర్ స్టేటస్​ను ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈ స్థితికి చేరుకునేందుకు సూర్యకుమార్ ఎంతో కష్టపడ్డాడు. 2012 నుంచి ఐపీఎల్​లో ఆడుతూ వస్తున్నాడు మిస్టర్ 360. తొలి మూడు సీజన్లలో కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున ఆడినా.. ఎక్కువ ఛాన్సులు రాలేదు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్​కు మారినప్పటి నుంచి అతడి ఫేట్ మారిపోయింది. దుమ్మురేపే పెర్ఫార్మెన్స్​లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వరుసగా మూడు సీజన్లలో 512, 424, 480 పరుగులు చేశాడు. అయినా అతడ్ని తీసుకోకపోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు 2021, మార్చిలో భారత జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన సూర్య.. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం గాయానికి సర్జరీ చేయించుకొని ఆస్పత్రిలో ఉన్న సూర్య.. ఈసారి ఐపీఎల్​ ఆరంభంలో కొన్ని మ్యాచులు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి.. సూర్య చరిత్ర సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.