iDreamPost
android-app
ios-app

Rishabh Pant: పంత్ షాకింగ్ కామెంట్స్.. రోహిత్ చెప్పాకే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం తెలిసింది!

  • Published Jan 20, 2024 | 10:00 PM Updated Updated Jan 20, 2024 | 10:00 PM

టీమిండియా డాషింగ్ బ్యాట్స్​మన్ రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ చెప్పాకే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం తెలిసిందన్నాడు.

టీమిండియా డాషింగ్ బ్యాట్స్​మన్ రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ చెప్పాకే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం తెలిసిందన్నాడు.

  • Published Jan 20, 2024 | 10:00 PMUpdated Jan 20, 2024 | 10:00 PM
Rishabh Pant: పంత్ షాకింగ్ కామెంట్స్.. రోహిత్ చెప్పాకే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం తెలిసింది!

ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ఓడించడం కష్టం. అది కూడా గబ్బా గ్రౌండ్​లో అయితే అసాధ్యం. అక్కడ మ్యాచ్​ను డ్రా చేసినా గొప్పే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది టీమిండియా. ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. 2021, జనవరి 19వ తేదీన కంగారూలను 3 వికెట్ల తేడాతో ఓడించింది భారత్. ఈ మ్యాచ్​లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్​లో 369 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన టీమిండియా 336 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్​లో 294 పరుగులు చేసింది ఆసీస్. దీంతో భారీ టార్గెట్​ను భారత్ ఛేజ్ చేయలేదని అంతా అనుకున్నారు. కానీ శుబ్​మన్ గిల్ (91), ఛతేశ్వర్ పుజారా (56) రాణించడంతో ఆశలు చిగురించాయి. రిషబ్ పంత్ (89 నాటౌట్) టెయిలెండర్స్ సాయంతో టీమ్​కు అద్భుత విజయాన్ని అందించాడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచిన దీనిపై పంత్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.

గబ్బా టెస్ట్​లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాన్నో మామూలు విజయంగా, సాధారణ ఇన్నింగ్స్​గానే చూశానన్నాడు.​ కానీ రోహిత్ శర్మ చెప్పాక గానీ ఆ ఇన్నింగ్స్ విలువ ఏంటో తనకు తెలియలేదన్నాడు. ‘రోహిత్ శర్మ చెప్పింది ఇంకా గుర్తుంది. ఆ మ్యాచ్​లో గెలుపు తర్వాత నా రియాక్షన్స్​ను హిట్​మ్యాన్ చూశాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నేను ఎక్సయిట్ కాకపోవడం అతడు గమనించాడు. నువ్వేం చేశావో నీకు అర్థం కావట్లేదని రోహిత్ అన్నాడు. మనం గెలిచామని, రెండోసారి సిరీస్ నెగ్గామని నేను చెప్పా. అయితే నువ్వు రిటైర్ అయ్యాక ఈ ఇన్నింగ్స్ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతందని అన్నాడు. అప్పుడు నేనేం చేశానో నాకు అర్థమైంది’ అని పంత్ చెప్పుకొచ్చాడు.

ఇక, రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన పంత్ గ్రౌండ్​లో కనిపించి ఏడాదికి పైనే అయిపోయింది. వేగంగా కోలుకుంటున్న అతడు.. జిమ్​లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలు అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తున్నాడు. అతడి రాక కోసం భారత అభిమానులతో పాటు జట్టు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. వికెట్ కీపర్​గా, బ్యాట్స్​మన్​గా అతడు టీమ్​లోకి తీసుకొచ్చే బ్యాలెన్స్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అందుకే అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది. అయితే ఇంజ్యురీ నుంచి కోలుకున్న పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ ఎందుకైనా మంచిదని స్పెషలిస్ట్ దగ్గర కన్సల్టేషన్ కోసం అతడ్ని లండన్​కు పంపాలని బీసీసీఐ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఐపీఎల్​ సీజన్​లో అతడు కొన్ని మ్యాచులు మిస్ అవ్వొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయితే పంత్ ఫిట్​నెస్​ మీద ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి.. పంత్ కమ్​బ్యాక్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.