Nidhan
టీమిండియా స్టార్ ఒకరు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. మరో ధోని అవుతాడంటూ అందరూ అతడ్ని ఆకాశానికెత్తారు. కానీ మాహీ స్థాయిలో అతడి కెరీర్ సాగలేదు.
టీమిండియా స్టార్ ఒకరు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. మరో ధోని అవుతాడంటూ అందరూ అతడ్ని ఆకాశానికెత్తారు. కానీ మాహీ స్థాయిలో అతడి కెరీర్ సాగలేదు.
Nidhan
భారత జట్టులో చోటు కోసం వేలాది మంది క్రికెటర్లు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటుతారు. అయితే ఎంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా జట్టులో ప్లేస్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి. అందుకే కొందరు ఆటగాళ్లు టీమిండియాలో స్థానం కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూనే ఉంటారు. అవకాశం వచ్చే దాకా పెర్ఫార్మ్ చేస్తూనే ఉంటారు. కానీ ఛాన్స్ వచ్చాక మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతారు. బాగా ఆడితే మంచి కెరీర్ కళ్ల ముందు కనిపిస్తున్నా ఒత్తిడి వల్లో లేదా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు తగినట్లు తమను తాము మలచుకోలేకో ఒకట్రెండు సిరీస్‌లకే పరిమితం అవుతారు. పోటీ ఎక్కువ కాబట్టి రాణించకపోతే ఆ అవకాశం ఇంకో ప్లేయర్‌కు వెళ్లిపోతుంది. అలా మూడ్నాలుగు మ్యాచులకే కెరీర్ క్లోజ్ అయిన వారిలో ఝార్ఖండ్ బ్యాటర్ సౌరభ్ తివారీ ఒకడు. అతడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
టీమిండియాకు మరో ధోని అవుతాడంటూ మంచి పేరు తెచ్చుకున్న సౌరభ్ తివారీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నెల 16వ తేదీన రాజస్థాన్‌తో స్టార్ట్ అయ్యే రంజీ మ్యాచ్ తన కెరీర్లో చివరిదని అతడు సోమవారం ప్రకటించాడు. 34 ఏళ్ల తివారీ భారత జట్టు తరఫున 2010లో 3 వన్డేలు ఆడి 49 పరుగులు చేశాడు. 115 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడిన ఈ ఝార్ఖండ్ బ్యాటర్.. 47.51 యావరేజ్‌తో 8,030 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 93 మ్యాచుల్లో 1,494 రన్స్ చేశాడు. లిస్ట్-ఏలో 116 మ్యాచులు ఆడిన తివారీ.. 4,050 పరుగులు చేశాడు. తన రిటైర్మెంట్ గురించి అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్కూల్‌కు వెళ్లకముందే మొదలైన ఈ ప్రయాణానికి ముగింపు పలకడం కష్టమైందేనన్నాడు. కానీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఇదే సరైన టైమ్ అన్నాడు.
నేషనల్ టీమ్‌కు, ఐపీఎల్‌కు ఆడనప్పుడు కొనసాగడం వృథా అని సౌరభ్ తివారీ పేర్కొన్నాడు. తాను తప్పుకుంటే యువ ఆటగాళ్లకు స్టేట్ టీమ్‌లో అవకాశం వస్తుందని భావించానని చెప్పుకొచ్చాడు. భారత టెస్ట్ టీమ్‌లో కుర్రాళ్లకు చోటు దక్కే ఛాన్స్ ఉందని.. అందుకే తాను గేమ్ నుంచి వైదొలుగి వాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని తివారీ వ్యాఖ్యానించాడు. ఇక, ఐపీఎల్లో 2010 సీజన్లో మెరుపులు మెరిపించిన తివారీ.. ఆ సీజన్లో 419 రన్స్ చేశాడు. దీంతో టీమిండియాలో అతడు చోటు దక్కించుకున్నాడు. కానీ ఆడిన మూడు మ్యాచుల్లో ఫెయిలై కేవలం 49 రన్స్ చేశాడు. చూడటానికి భారీ జుట్టుతో ధోనీలా ఉండటం, బిగ్ షాట్స్ కొట్టడంలో ఆరితేరడంతో అతడ్ని అందరూ నెక్స్ట్ ధోని అనుకున్నారు. కానీ మాహీ వారసుడిగా అతడు ఎదగలేకపోయాడు. మరి.. సౌరభ్ తివారీ రిటైర్మెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ranji Trophy 2024: వీడియో: చరిత్ర సృష్టించిన KKR బౌలర్.. 4 బంతుల్లో 4 వికెట్లు!
Saurabh Tiwari has announced his retirement from professional cricket. pic.twitter.com/k2KthN3Odz
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024