iDreamPost

Ranji Trophy 2024: వీడియో: చరిత్ర సృష్టించిన KKR బౌలర్.. 4 బంతుల్లో 4 వికెట్లు!

మధ్యప్రదేశ్-బరోడా జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు మధ్యప్రదేశ్ బౌలర్ కుల్వంత్ ఖేజ్రోలియా. దీంతో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

మధ్యప్రదేశ్-బరోడా జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు మధ్యప్రదేశ్ బౌలర్ కుల్వంత్ ఖేజ్రోలియా. దీంతో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

Ranji Trophy 2024: వీడియో: చరిత్ర సృష్టించిన KKR బౌలర్.. 4 బంతుల్లో 4 వికెట్లు!

రంజీ ట్రోఫీ 2024లో సంచలనం నమోదైంది. తాజాగా మధ్యప్రదేశ్-బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు మధ్యప్రదేశ్ బౌలర్ కుల్వంత్ ఖేజ్రోలియా. ఈ మ్యాచ్ లో ఏకంగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో ఎంపీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యువ బౌలర్.

కుల్వంత్ ఖేజ్రోలియా.. రంజీ ట్రోఫీలో భాగంగా తాజాగా బరోడాతో జరిగిన మ్యాచ్ లో సంచలన ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరిచాడు. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి మధ్యప్రదేశ్ టీమ్ కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో తన ఖాతాలో హ్యాట్రిక్ తో పాటుగా మెుత్తం 5 వికెట్లు కూల్చాడు. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ బౌలర్ హ్యాట్రిక్ తీసుకోవడం రంజీ ట్రోపీ చరిత్రలో ఇది మూడోసారి కాగా.. ఓవరాల్ గా 80వ హ్యాట్రిక్. బరోడా జట్టు ఫాలో ఆన్ ఆడుతున్న సమయంలో ఇన్నింగ్స్ 95వ ఓవర్లో ఈ సంచలనం నమోదు అయ్యింది.

ఈ ఓవర్లో కుల్వంత్ 2,3,4,5 బంతుల్లో వరుసగా రావత్, మహేష్ పిథియా, భార్గవ్ భట్, ఆకాష్ సింగ్ ల వికెట్లను పడగొట్టాడు. అయితే ఈ ఓవర్ కు ముందు 11 ఓవర్లు వేసిన కుల్వంత్ ఖేజ్రోలియా కేవలం ఒక వికెట్ తీయగా.. ఆ తర్వాత ఓవర్ లో 4 వికెట్లు తీయడం గమనార్హం. దీంతో ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు కుల్వంత్. ఇంతకు ముందు శంకర్ సైనీ ఢిల్లీ తరఫున 1988లో హిమాచల్ ప్రదేశ్ పై తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత మహ్మద్ ముధాసిర్ 2018లో రాజస్థాన్ టీమ్ పై ఈ ఫీట్ రిపీట్ చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 454 పరుగులకు ఆలౌట్ కాగా.. బరోడా తొలి ఇన్నింగ్స్ లో 132, రెండో ఇన్నింగ్స్ లో 270 పరుగులకు ఆలౌట్ అయ్యి.. ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో ఓటమి చెందింది. కాగా.. కుల్వంత్ ఖేజ్రోలియాకు ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉంది. 2018, 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడగా.. ప్రస్తుతం కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరి 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఈ ఎంపీ బౌలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: టీమిండియాను వదలని బ్యాడ్ లక్.. మూడో టెస్ట్ కు ఆ స్టార్ ప్లేయర్ దూరం?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి