iDreamPost
android-app
ios-app

Bhuvneshwar Kumar: వీడియో: రీఎంట్రీ కోసం భువనేశ్వర్ కష్టాలు.. ఈసారి కమ్​బ్యాక్ ఇవ్వడం పక్కా!

  • Published Aug 09, 2024 | 3:53 PM Updated Updated Aug 09, 2024 | 3:53 PM

టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంటర్నేషనల్ క్రికెట్​లో కనిపించక చాన్నాళ్లు అవుతోంది. ఐపీఎల్​లో తప్ప పెద్దగా అతడు ఎక్కడా సందడి చేయడం లేదు.

టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంటర్నేషనల్ క్రికెట్​లో కనిపించక చాన్నాళ్లు అవుతోంది. ఐపీఎల్​లో తప్ప పెద్దగా అతడు ఎక్కడా సందడి చేయడం లేదు.

  • Published Aug 09, 2024 | 3:53 PMUpdated Aug 09, 2024 | 3:53 PM
Bhuvneshwar Kumar: వీడియో: రీఎంట్రీ కోసం భువనేశ్వర్ కష్టాలు.. ఈసారి కమ్​బ్యాక్ ఇవ్వడం పక్కా!

భువనేశ్వర్ కుమార్.. ఇంటర్నేషనల్ క్రికెట్​కు భారత్ అందించిన అత్యుత్తమ పేసర్లలో ఒకడు. ఇతర స్పీడ్​స్టర్స్​లా పేస్​తో కాకుండా స్వింగ్​తో గుర్తింపు సంపాదించాడతను. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఓ రేంజ్​లో పోయించేవాడు భువీ. ఫార్మాట్​ను బట్టి బౌలింగ్​లో స్వల్ప మార్పులు చేసుకొని అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు భారత జట్టు బౌలింగ్ యూనిట్​లో టాప్ బౌలర్​గా హవా నడిపించిన భువీ.. ఆ తర్వాత గాయాల వల్ల క్రమంగా టీమ్​కు దూరమయ్యాడు. ఇంజ్యురీ నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చినా మళ్లీ మునుపటి స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాడు.

గాయాల వల్ల భువనేశ్వర్ బౌలింగ్​లో వేగం, పదును తగ్గాయి. మునుపటి స్థాయిలో స్వింగ్​ కూడా చేయలేక ఇబ్బందులు పడ్డాడు. అయినా కమ్​బ్యాక్​లో కొన్ని సిరీస్​లు ఆడి అలరించాడు. అయితే ఆ తర్వాత అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ వంటి యంగ్ గన్స్ టీమ్​లోకి దూసుకురావడంతో భువీకి ప్లేస్ దక్కలేదు. మళ్లీ ఎంత ప్రయత్నించినా కమ్​బ్యాక్ ఇవ్వలేకపోయాడు. ఐపీఎల్​లో రాణించినా అతడ్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. అయినా భువనేశ్వర్ మాత్రం ఆశలు చంపుకోలేదు. తిరిగి భారత జట్టులోకి కమ్​బ్యాక్ ఇవ్వడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నెట్స్​లో బౌలింగ్ సాధన చేస్తూనే జిమ్​లో వర్కౌట్లు చేస్తూ చెమటోడ్చుతున్నాడు.

Bhuvi

భువీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్స్​లో వరుసగా బంతులు వేస్తూ కనిపించిన అతడు.. జిమ్​లో బరువులు ఎత్తుతూ దర్శనం ఇచ్చాడు. ఎంతో ఫిట్​గా కనిపించిన భువీ కష్టం, తపన చూస్తుంటే ఈసారి డొమెస్టిక్ టోర్నమెంట్స్, ఐపీఎల్​లో రాణించి మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. క్రమశిక్షణ, సాధించాలనే తపన, లక్ష్యంపై గురి ఉన్న భువీ లాంటి ఆటగాళ్లు ఏదైనా చేయగలరని.. అతడి ప్రాక్టీస్ చూస్తుంటే ఈజీగా టీమ్​లోకి కమ్​బ్యాక్ ఇస్తాడని చెబుతున్నారు. 34 ఏళ్ల భువీ మంచి ఫిట్​నెస్​, రిథమ్​లో ఉంటే ఇంకో మూడ్నాలుగేళ్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగలడు. మరి.. భువీ రీఎంట్రీ ఖాయమేనా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.