iDreamPost
android-app
ios-app

Shreyas Iyer-Gambhir: డేంజర్​లో అయ్యర్ కెరీర్.. గంభీర్ తలచుకున్నా రీఎంట్రీ కష్టమే!

  • Published Aug 08, 2024 | 5:53 PM Updated Updated Aug 08, 2024 | 5:53 PM

India vs Sri Lanka: టీమిండియా స్టార్ బ్యాటర్ కెరీర్ ఇప్పుడు రిస్క్​లో పడింది. ఆల్ ఫార్మాట్​ ప్లేయర్​గా ఎదిగే ఛాన్స్ వచ్చినా అతడు చేజేతులా మిస్ చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

India vs Sri Lanka: టీమిండియా స్టార్ బ్యాటర్ కెరీర్ ఇప్పుడు రిస్క్​లో పడింది. ఆల్ ఫార్మాట్​ ప్లేయర్​గా ఎదిగే ఛాన్స్ వచ్చినా అతడు చేజేతులా మిస్ చేసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Published Aug 08, 2024 | 5:53 PMUpdated Aug 08, 2024 | 5:53 PM
Shreyas Iyer-Gambhir: డేంజర్​లో అయ్యర్ కెరీర్.. గంభీర్ తలచుకున్నా రీఎంట్రీ కష్టమే!

అన్ని ఫార్మాట్లలోనూ టాప్​ టీమ్​గా దూసుకుపోతున్న భారత్.. మునుపటి ప్రభను కోల్పోయిన శ్రీలంకతో ఆడుతోందంటే ఆ జట్టును వైట్​వాష్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే టీ20 సిరీస్​లో లంకను టీమిండియా క్లీన్​స్వీప్ చేసింది. దీంతో వన్డే సిరీస్ కూడా మనదేనని అంతా ఫిక్స్ అయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి వన్డే స్పెషలిస్ట్​లు టీమ్​లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆతిథ్య జట్టుకు దబిడిదిబిడేనని భావించారు. సింహళ జట్టు నుంచి కనీస పోటీ అయినా ఉంటుందా అని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. రోహిత్ సేనను వరుస మ్యాచుల్లో ఓడించి సిరీస్​ను 2-0తో గెలుచుకుందా టీమ్. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే సిరీస్ ముగిసింది.

బ్యాటింగ్ ఫెయిల్యూర్, టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడం, వార్మప్ మ్యాచ్​లు లేకపోవడం, లంక పిచ్​లను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, స్పిన్ బౌలింగ్​ను ఎదుర్కోవడంలో ఉన్న బలహీనత.. ఇలా భారత్ ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘోర పరాభవం టీమ్ ఫ్యూచర్​పై పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. కొందరు ఆటగాళ్ల కెరీర్​ మీద మాత్రం ఎఫెక్ట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. అందులో స్టార్ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్ కూడా  ఉన్నాడు. అతడి కెరీర్ ఇప్పుడు డేంజర్​లో పడింది. లంకతో వన్డే సిరీస్​లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఈ టాలెంట్ బ్యాటర్ తీవ్రంగా నిరుత్సాహపర్చాడు. తొలి వన్డేలో 23 పరుగులు చేసిన చేసిన అయ్యర్.. మిగిలిన రెండు వన్డేల్లో కలిపి 15 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్​గా సిరీస్​లో 38 రన్స్ చేశాడు. మిడిలార్డర్​లో బ్యాటింగ్​ చేసిన అయ్యర్.. ఇన్నింగ్స్​ను నిలబెట్టి భారీ స్కోరు దిశగా టీమ్​ను తీసుకెళ్తాడని అనుకుంటే త్వరగా ఔటై టీమ్ పతనానికి కారణమయ్యాడు.

అయ్యర్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లి ఉంటే సిరీస్​లో రిజల్ట్ మరోలా ఉండేది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే.. వన్డేల్లో చాలా బాగా ఆడుతూ వచ్చాడు శ్రేయస్. 50 ఓవర్ల వరల్డ్ కప్-2023​లో కూడా భారీగా పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన ఇంగ్లండ్ సిరీస్​లో బీసీసీఐ మాట పెడచెవిన పెట్టి కాంట్రాక్ట్ కోల్పోయాడు. ఐపీఎల్ సక్సెస్​తో తిరిగి టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ లంక సిరీస్​లో దారుణంగా ఫెయిలయ్యాడు. భారత్ ఇంకో ఆర్నెళ్ల వరకు వన్డే ఆడదు. ఈ గ్యాప్​లో పలు టీ20లు, టెస్టులు జరగనున్నాయి.

ఇక మీదట జరిగే పొట్టి ఫార్మాట్​ సిరీస్​ల్లో అయ్యర్​కు చోటు దక్కే అవకాశాలు లేవు. టెస్టుల్లోనూ అతడ్ని ఎంపిక చేసినా ఆడిస్తారనే గ్యారెంటీ లేదు. ఈ గ్యాప్​లో ఇతర ఆటగాళ్లు ఎవరైనా మిడిలార్డర్​లో రాణిస్తే అయ్యర్​కు ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్​లో చోటు దక్కడం కష్టమే. లంక సిరీస్​లో రాణిస్తే మిగిలిన రెండు ఫార్మాట్లలో కమ్​బ్యాక్ ఇచ్చేవాడు అయ్యర్. కానీ చేజేతులా అది కోల్పోవడమే గాక ఇప్పుడు వన్డే టీమ్​లో బెర్త్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయ్యర్ కెరీర్ ఇక ముగిసిందని.. గంభీర్ కూడా అతడ్ని కాపాడలేడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తాడా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.