SNP
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం టీమిండియా రెడీగా ఉంది. అయితే.. ఈ మ్యాచ్ భారత్ కచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. రెండు టెస్ట్‌లు ఈ సిరీస్ సమం చేయడంతో పాటు.. మరో విషయంలో కూడా మెరుగుపడాల్సి ఉంది. లేదంటే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే ఆధ్వానంగా మారే పరిస్థితి ఉంది.
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం టీమిండియా రెడీగా ఉంది. అయితే.. ఈ మ్యాచ్ భారత్ కచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. రెండు టెస్ట్‌లు ఈ సిరీస్ సమం చేయడంతో పాటు.. మరో విషయంలో కూడా మెరుగుపడాల్సి ఉంది. లేదంటే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే ఆధ్వానంగా మారే పరిస్థితి ఉంది.
SNP
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోంది. బుధవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా ఇండియా-సౌతాఫ్రికా మధ్య చివరిదైన రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి క్లీన్ స్వీప్ చేద్దామని సఫారీలు భావిస్తోంటే.. మరోవైపు పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణమైన ఓటమిని చవిచూసింది. ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లంతా ముకుమ్మడిగా విఫలం అయ్యారు. బౌలింగ్ బుమ్రా ఒక్కడే సత్తా చాటాడు.
వీళ్లు ముగ్గురు మినహా.. మొత్తంగా టీమిండియా విఫలమైందనే చెప్పాలి. వీరికి సరైన సహకారం లేకపోవడంతోనే జట్టుకు ఘోర ఓటమి ఎదురైంది. అయితే.. ఈ ఓటమి సంగతి పక్కనపెడితే.. ఒక విషయంలో టీమిండియా పరువుపోయేలా కనిపిస్తుంది. అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసులో. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రవేశపెట్టిన తర్వాత.. టీమిండియా తొలి రెండు సార్లు వరుసగా ఫైనల్‌కు చేరింది. తొలి సారి 2021లో న్యూజిలాండ్‌తో, 2023 ఆరంభంలో ఆస్ట్రేలియాతో.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడింది. కానీ, దురదృష్టవశాత్తు రెండు సార్లు కూడా టీమిండియా రన్నరప్‌గానే మిగిలిపోయింది. కానీ, 2025లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను టీమిండియాను గెలవాలని భారత క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
కానీ, టీమిండియా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాలంటే.. టెస్ట్ ఆడే దేశాల్లో టాప్ 2లో నిలవాలి. ఆ లిస్ట్‌లో టీమిండియా ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. మరో చేదు నిజం ఏంటంటే.. మనకంటే ముందుకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అందరి కంటే ముందు.. టాప్ ప్లేస్‌లో సౌతాఫ్రికా ఉంది. మనపై రెండో టెస్ట్‌లోనూ గెలిచి అగ్రస్థానాన్ని మరింత బలపర్చుకోవాలని ప్రొటీస్ టీమ్ భావిస్తోంది. ఇక రెండో స్థానంలో న్యూజిలాండ్, మూడో ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఉన్నాయి. ఈ మూడు టాప్ టీమ్స్ కదా.. వీటితో పోటీ పడినా పర్వాలేదు. కానీ, దారుణంగా బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో, పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. టీమిండియా వాటి తర్వాత ఆరో స్థానంలో నిలిచింది. మన తర్వాత వెస్టిండీస్ ఏదో స్థానంలో, ఇంగ్లండ్ ఎనిమిదో ప్లేస్‌లో, శ్రీలంక చివరి స్థానంలో ఉంది. మరి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ లిస్ట్‌లో టీమిండియా మరీ అధ్వానంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.