Nidhan
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన ఫెయిల్యూర్‌కు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని అన్నాడు.
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన ఫెయిల్యూర్‌కు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని అన్నాడు.
Nidhan
టీమిండియా ఏస్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. మధ్యలో కొన్నాళ్లు ఫామ్‌లేమితో సతమతమైన ఈ చైనామన్ బౌలర్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు. అతడ్ని ఆపడం బ్యాటర్ల వల్ల కావడం లేదు. గాయం తర్వాత ఎన్సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న కుల్దీప్.. అక్కడ తన బౌలింగ్‌ను సానబెట్టుకున్నాడు. మరిన్ని వేరియేషన్స్, స్పీడ్ పెంచుకొని రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ నుంచి ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ వరకు కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్‌తో భారత జట్టు సాధిస్తున్న విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నాడు. అయితే కొన్నాళ్లు తాను బ్యాడ్ ఫేజ్ చూశానని.. దీనికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని అంటున్నాడు. తన ఫెయిల్యూర్‌కు మాహీనే రీజన్ అని చెబుతున్నాడు. కుల్దీప్ ఇలా ఎందుకు అంటున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
‘ధోని భాయ్ ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడాల్సింది. అతడు టీమ్‌లో ఉంటే బౌలింగ్ చేయడం చాలా ఈజీ. కానీ ధోని రిటైర్ అయ్యాడు. దీంతో నా పెర్ఫార్మెన్స్ పడిపోయింది. మనల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ముందుకు నడిపించేవారు లేనప్పుడు ఇలాగే జరుగుతుంది. ప్రోత్సహించే వాళ్లు దూరమైనప్పుడు ఒక్కసారిగా బరువు, బాధ్యతలు మన భుజాల మీద పడతాయి. అలాంటప్పుడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. నా విషయంలో అదే జరిగింది. ధోని భాయ్ వెళ్లిపోయాక నేను కోలుకొని తిరిగి రాణించడానికి టైమ్ పట్టింది. నా మీద నేనే డిపెండ్ అవ్వాలని క్రమంగా అర్థం చేసుకున్నా’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. తన సక్సెస్‌లో ధోని ఎంతో కీలకపాత్ర పోషించాడని.. కానీ అతడు టీమ్‌ను వీడటం తనకు ప్రతికూలంగా మారిందన్నాడు. అయితే మొత్తానికి ఇప్పుడు గాడిలో పడ్డానని పేర్కొన్నాడు.
ఇక, ఇంగ్లండ్‌తో రీసెంట్గా జరిగిన టెస్ట్ సిరీస్‌లో కుల్దీప్ అద్భుతంగా రాణించాడు. నాలుగు మ్యాచుల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. బజ్‌బల్ క్రికెట్‌తో బడాయికి పోయిన ఇంగ్లీష్ బ్యాటర్లను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి స్పిన్ మ్యాజిక్ ముందు ఎవరూ నిలబడలేకపోయారు. అందుకే కుల్దీప్ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంగ్లండ్ లెజెండ్ జెఫ్రీ బాయ్‌కాట్ కూడా అతడిపై పొడగ్తల వర్షం కురిపించాడు. ‘కుల్దీప్ బౌలింగ్‌ను ఇంగ్లీష్ బ్యాటర్లు అర్థం చేసుకోలేకపోయారు. సిరీస్ ఆఖరి వరకు ఇదే కంటిన్యూ అయింది. మొదట్లో అతడు మిస్టరీగా అనిపించడం వరకు ఓకే. కానీ ఒక ఇంటర్నేషనల్ బౌలర్‌ను ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవాలి’ అని బాయ్‌కాట్ వ్యాఖ్యానించాడు. మరి.. ధోని వల్లే తాను ఫెయిలయ్యానని కుల్దీప్ అనడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గుజరాత్ టీమ్‌లో ఇదీ హార్దిక్ పరిస్థితి.. నెహ్రా కామెంట్‌తో అసలు నిజం బయటపడింది!
Kuldeep Yadav said “I wanted Dhoni Bhai to play more because it was very easy when we were bowling – after Dhoni retired, my performance wasn’t great, it happens when a person guides you & that person’s influence is not there – then suddenly everything on your shoulders – it… pic.twitter.com/tMo7kz0I6D
— Johns. (@CricCrazyJohns) March 16, 2024