Nidhan
టీమిండియాపై ఓ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ వచ్చే దాకా జట్టుకు అతడే గతి అన్నాడు. ఆ మాజీ ఆటగాడు ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియాపై ఓ సీనియర్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ వచ్చే దాకా జట్టుకు అతడే గతి అన్నాడు. ఆ మాజీ ఆటగాడు ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
Nidhan
క్రికెట్లో సంప్రదాయ ఫార్మాట్‌గా చెప్పుకునే టెస్టుల్లో ఆడటం అంత ఈజీ కాదు. ముఖ్యంగా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. నిప్పులు చెరిగే వేగంతో దూసుకొచ్చే బంతుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా పేస్, స్వింగింగ్ డెలివరీస్‌తో పాటు గింగిరాలు తిరిగే స్పిన్నూ ఎదుర్కొని క్రీజులో నిలవాలి. దీనికి ఎంతో ఓపిక, సంయమనంతో పాటు మంచి టెక్నిక్ అవసరం. భారత బ్యాటర్లకు విదేశాల్లో ఎక్కువగా సవాళ్లు ఎదురవుతాయి. పేస్, బౌన్సీ పిచ్‌లపై ఫారెన్ పేస్ బౌలర్లను తట్టుకొని రన్స్ చేయడంలో మన బ్యాటర్లు తరచూ ఫెయిల్ అవుతుంటారు. అయితే విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, రిషబ్ పంత్ లాంటి వాళ్లు వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. టెక్నిక్‌తో పాటు ఓపికతో ఆడితే ఫారెన్ పిచ్‌ల మీద రన్స్ చేయడం ఈజీ అని వీళ్లు నిరూపించారు. అలాంటి పంత్, కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
స్వదేశంతో పాటు విదేశాల్లోనూ టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా రన్స్ చేస్తున్న వారిలో విరాట్ కోహ్లీ ఒకడు. లాంగ్ ఫార్మాట్లో సేనా దేశాలపై రన్స్ విషయంలో అతడికి ఉన్న రికార్డు ప్రస్తుత ఆసియా ప్లేయర్లలో ఎవరికీ లేదు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లోనూ కోహ్లీ దుమ్మురేపాడు. ఈ నేపథ్యంలో అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు సంజయ్ మంజ్రేకర్. కోహ్లీ అందిస్తున్న సేవలకు భారత జట్టు ఎంతో రుణపడి ఉంటుందన్నాడు. విరాట్ లాంటి ప్లేయర్ టీమిండియాలో ఉన్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని మంజ్రేకర్ తెలిపాడు. సౌతాఫ్రికా టూర్లో కోహ్లీ ఆడిన తీరు అద్భుతమని.. అతడికి వేరే బ్యాటర్లకు మధ్య స్పష్టమైన తేడా కనిపించిందన్నాడు. టీమ్‌లోని మరో బెస్ట్ బ్యాటర్ రిషబ్ పంత్ వచ్చే దాకా భారత జట్టుకు కోహ్లీనే గతి అన్నాడు మంజ్రేకర్.
రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ మీదా మంజ్రేకర్ రియాక్ట్ అయ్యాడు. లాంగ్ ఫార్మాట్లో ఎప్పటిదాకా కంటిన్యూ అవ్వాలనేది హిట్‌మ్యాన్ ఇష్టమన్నాడు. అయితే రోహిత్‌కు పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ మాత్రం లేదన్నాడు. అతడికి టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. ఇది మాటల ద్వారా తెలిసిపోతుందన్నాడు. రోహిత్, కోహ్లీలు పాతతరం ఆటగాళ్లని.. టెస్టుల్లో ఎలా ఆడాలనే టెక్నిక్‌ను వీళ్ల నుంచి యంగ్‌స్టర్స్ నేర్చుకోవాలన్నాడు మంజ్రేకర్. ఒకవేళ రోహిత్ తన కెరీర్‌ను మరింత కాలం పొడిగించుకుందామని భావిస్తే అది అతడి నిర్ణయమన్నాడు. ఇక, త్వరలో ఆఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. జనవరి 25న హైదరాబాద్‌లో జరిగే ఫస్ట్ టెస్ట్‌తో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. మరి.. కోహ్లీ, పంత్‌ను ఉద్దేశించి మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: సంచలన నిర్ణయం తీసుకున్న SRH స్టార్ ప్లేయర్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై!
Sanjay Manjrekar said, “thank god that India have Virat Kohli. He showed on this SA tour, the kind of challenges that batters face that there’s a big distance between him and the next best Test batter in India at least until Rishabh Pant is back”. (Espncricinfo). pic.twitter.com/qKFPxwUF71
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024