iDreamPost

సంచలన నిర్ణయం తీసుకున్న SRH స్టార్ ప్లేయర్.. ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై!

  • Published Jan 08, 2024 | 3:32 PMUpdated Jan 08, 2024 | 3:32 PM

సన్​రైజర్స్ హైదరాబాద్​ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. ఎవరా ఆటగాడు? ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

సన్​రైజర్స్ హైదరాబాద్​ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. ఎవరా ఆటగాడు? ఎందుకీ నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 08, 2024 | 3:32 PMUpdated Jan 08, 2024 | 3:32 PM
సంచలన నిర్ణయం తీసుకున్న SRH స్టార్ ప్లేయర్.. ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై!

రిటైర్మెంట్.. ఈ పదం వినగానే అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా భయపడతారు. తమ స్కిల్స్​తో ఇన్నాళ్లూ ఎంతో అలరించిన ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకుంటున్నారనే వార్తను వింటే వాళ్లు తట్టుకోలేరు. నిన్నటి దాకా తమ అద్భుతమైన టాలెంట్​తో అలరించిన వాళ్లు ఇక మీదట గ్రౌండ్​లో కనిపించరనే న్యూస్ వాళ్లను ఎంతో భావోద్వేగానికి లోను చేస్తుంది. అయితే ఏ ప్లేయర్ అయినా సరే.. ఎప్పటికైనా రిటైర్ అవ్వాల్సిందేననే నిజాన్ని తలచుకొని క్రమంగా అందులో నుంచి బయటపడతారు. సీనియర్ ఆటగాళ్ల విషయంలో రిటైర్మెంట్ వార్తలు రావడం కామనే. కానీ ఇప్పుడిప్పుడే తమ ఆటతీరుతో అందరి అభిమానాన్ని చూరగొంటూ స్టార్లుగా పేరు తెచ్చుకుంటున్న వాళ్లు సడన్​గా రిటైర్మెంట్ ప్రకటిస్తే తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడో ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇలాగే హఠాత్తుగా గేమ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అతడే విధ్వంసక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్.

సౌతాఫ్రికా డాషింగ్ బ్యాట్స్​మన్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు క్లాసెన్. తన రిటైర్మెంట్ డెసిజన్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపాడు. లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకునే విషయం మీద ఆలోచిస్తూ చాలా నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పాడు. టెస్టుల విషయంలో తన నిర్ణయం సరైందా? కాదా? అని చాలా మథనపడ్డానని పేర్కొన్నాడు. అయితే చివరికి ఈ ఫార్మాట్​కు గుడ్​బై చెప్పాలని డిసైడ్ అయ్యానని ఒక స్టేట్​మెంట్ ద్వారా వెల్లడించాడు. ఇది చాలా కఠిన నిర్ణయమని.. తన ఫేవరెట్ ఫార్మాట్ అయిన టెస్టుల నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు బాధగా ఉందన్నాడు క్లాసెన్. 32 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాటర్ తన కెరీర్​లో ఇప్పటిదాకా 4 టెస్టులే ఆడాడు. 2019లో లాంగ్ ఫార్మాట్​లోకి అడుగుపెట్టిన ఈ బ్యాటర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. క్వింటన్ డికాక్ అప్పటికే టీమ్​లో సెటిల్ అవడంతో క్లాసెన్​కు పెద్దగా అవకాశాలు రాలేదు.

ఈ మధ్య కాలంలో వన్డేలు, టీ20ల్లో సునామీ ఇన్నింగ్స్​లతో దుమ్మురేపుతున్నప్పటికీ సౌతాఫ్రికా సెలక్టర్లు క్లాసెన్​ను పట్టించుకోవడం లేదు. లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​లో అతడికి పెద్ద పీట వేస్తున్న సెలక్టర్లు.. టెస్ట్ టీమ్ విషయంలో మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. లిమిటెడ్ ఓవర్స్​ స్పెషలిస్ట్​గా ముద్ర పడటమే క్లాసెన్​కు టెస్టుల్లో ఛాన్సులు రాకపోవడానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఈ స్టార్ బ్యాటర్ 4 టెస్టులు ఆడి కేవలం 104 రన్స్ మాత్రమే చేశాడు. అయితే ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో మాత్రం అతడి రికార్డు అద్భుతంగా ఉంది. అక్కడ 85 మ్యాచుల్లో 46.09 యావరేజ్​తో 5,347 రన్స్ చేశాడు. ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ తరఫున ఆడుతున్న క్లాసెన్ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడికి లాంగ్ ఫార్మాట్​లో అవకాశం ఇస్తే ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్​లా అద్భుతాలు చేసేవాడని అంటున్నారు. మరి.. టెస్టు క్రికెట్​కు క్లాసెన్ గుడ్​బై చెప్పడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: టీ20 టీమ్​లోకి కోహ్లీ రీఎంట్రీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన గంగూలీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి