iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: భారత్​కు బ్యాడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్​ నుంచి షమి ఔట్!

  • Published Mar 11, 2024 | 4:43 PM Updated Updated Mar 11, 2024 | 4:58 PM

ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్​కు ముందు భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. వెటరన్ పేసర్ మహ్మద్ షమి రూపంలో టీమ్​కు భారీ షాక్ తగిలింది.

ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్​కు ముందు భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్. వెటరన్ పేసర్ మహ్మద్ షమి రూపంలో టీమ్​కు భారీ షాక్ తగిలింది.

  • Published Mar 11, 2024 | 4:43 PMUpdated Mar 11, 2024 | 4:58 PM
బ్రేకింగ్: భారత్​కు బ్యాడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్​ నుంచి షమి ఔట్!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​లో భారత జట్టు ఓడిపోవడంతో అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారు. ఆటగాళ్లు కూడా ఫైనల్ ఓటమి మిగిల్చిన పెయిన్ నుంచి తేరుకొని మిగిలిన సిరీస్​లపై ఫోకస్ పెడుతున్నారు. అయితే ఇదే ఏడాది జూన్​లో టీ20 ప్రపంచ కప్-2024 జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో పొట్టి కప్​ను రోహిత్ సేన గెలుచుకోవాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వెటరన్ పేసర్ మహ్మద్ షమి టీ20 ప్రపంచ కప్​ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. గాయంతో బాధపడుతున్న షమి ఇంకా కోలుకోలేదని.. ఐపీఎల్-2024తో పాటు పొట్టి ప్రపంచ కప్​కు అతడు అందుబాటులో ఉండడని షా చెప్పారు.

షమి గాయం, సర్జరీతో పాటు అతడి కమ్​బ్యాక్​పై జై షా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న షమీని ఆయన కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘షమీకి సర్జరీ పూర్తయింది. ఆపరేషన్ తర్వాత అతడు భారత్​కు తిరిగి వచ్చేశాడు. ఈ ఏడాది ఆఖర్లో బంగ్లాదేశ్​తో జరిగే హోమ్ సిరీస్​తో అతడు కమ్​బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది’ అని షా తెలిపారు. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్​ ఇంజ్యురీ మీదా ఆయన రియాక్ట్ అయ్యారు. రాహుల్ ఇంకో ఇంజక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని.. అతడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్​ అకాడమీలో రిహాబిలిటేషన్​లో ఉన్నాడని చెప్పుకొచ్చారు.

షమి, రాహుల్​తో పాటు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ మీద కూడా షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ రికవర్ అయ్యాడని.. ప్రస్తుతం అతడు బ్యాటింగ్ సాధన చేస్తున్నాడని తెలిపారు. అతడు ఫిట్​గా ఉన్నాడని త్వరలో డిక్లేర్ చేస్తామని చెప్పుకొచ్చారు. భారత క్రికెట్​కు పంత్ గొప్ప ఆస్తి లాంటి వాడని.. అతడ్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు షా. అతడు పూర్తి ఫిట్​నెస్​ సాధించి తిరిగి ఫామ్​ను అందుకుంటే టీ20 వరల్డ్ కప్​లో ఆడటం ఖాయం అని స్పష్టం చేశారు. ఐపీఎల్-2024లో పంత్ ఎలా ఆడతాడో చూడాలని ఉందని షా వ్యాఖ్యానించారు.

కాగా, వన్డే ప్రపంచ కప్ టైమ్​లో గాయపడిన షమి.. ఎన్​సీఏలో ఉంటూ ట్రీట్​మెంట్ తీసుకున్నాడు. కానీ గాయం మానకపోవడంతో రీసెంట్​గా సర్జరీ చేయించుకున్నాడు. అతడు పూర్తిగా రికవర్ అయి కమ్​బ్యాక్ ఇవ్వాలంటే ఇంకో ఆరేడు నెలలు పట్టేలా ఉందని జై షా తెలిపారు. షమి దూరమవడంతో టీ20 వరల్డ్ కప్​కు ముందు భారత్​కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే. ఎంతో అనుభవం, అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యం, భీకర ఫామ్​లో ఉన్న అలాంటోడ్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. ఈ లోటును టీమ్ మేనేజ్​మెంట్, సెలక్టర్లు ఎలా పూరిస్తారో చూడాలి. మరి.. టీ20 వరల్డ్ కప్​కు షమి దూరమవడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL 2024.. కష్టాల్లో ఉన్న గుజరాత్ కు గుడ్ న్యూస్! స్టార్ ప్లేయర్ వస్తున్నాడు