iDreamPost

IPL 2024.. కష్టాల్లో ఉన్న గుజరాత్ కు గుడ్ న్యూస్! స్టార్ ప్లేయర్ వస్తున్నాడు

ఐపీఎల్ 2024కు ముందు హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ దూరమై కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. సర్జరీ కారణంగా దాదాపు నాలుగు నెలల తర్వాత క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు స్టార్ ప్లేయర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024కు ముందు హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ దూరమై కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. సర్జరీ కారణంగా దాదాపు నాలుగు నెలల తర్వాత క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు స్టార్ ప్లేయర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024.. కష్టాల్లో ఉన్న గుజరాత్ కు గుడ్ న్యూస్! స్టార్ ప్లేయర్ వస్తున్నాడు

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కష్టాల్లో ఉంది. టోర్నీలోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే కప్ కొట్టి, ఆ తర్వాత రన్నరప్ గా నిలిచింది గుజరాత్ టీమ్. ఇక ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెల్లడంతో జట్టుకు భారీ దెబ్బపడింది. దీంతో పాటుగా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా సర్జరీ చేయించుకుని ఈ సీజన్ మెుత్తానికే దూరమైయ్యాడు. దీంతో గుజరాత్ టీమ్ వీకైంది. ఇలాంటి టైమ్ లో ఈ జట్టుకు భారీ గుడ్ న్యూస్ అందింది.

హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ దూరం కావడంతో.. గుజరాత్ టీమ్ బలహీనపడింది. ఇలాంటి సమయంలో ఓ గుడ్ న్యూస్ వారికి ఉపశమనం కలిగించింది. ప్రపంచ అత్యున్నత స్పిన్నర్ రషీద్ ఖాన్ తిరిగి క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత అతడు మైదానంలోకి రాబోతున్నట్లు తెలియజేశాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకున్నాడు ఈ స్టార్ స్పిన్నర్. అప్పటి నుంచి ఆటకు దూరమైయ్యాడు. ప్రస్తుతం ఈ గాయం నుంచి కోలుకున్న అతడు మార్చి 15 నుంచి ఐర్లాండ్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

“సర్జరీ కారణంగా గడిచిన మూడు నెలలు ఎంతో కష్టంగా గడిచింది. వెన్నునొప్పి 7-8 నెలలుగా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అయితే వరల్డ్ కప్ కంటే ముందుగానే సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. కానీ మెగాటోర్నీలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలని అలాగే ఆడాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్. ఇక గత సీజన్ లో 17 మ్యాచ్ లు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు ఈ స్టార్ స్పిన్నర్. ఇక తన ఐపీఎల్ కెరీర్ లో 109 మ్యాచ్ లు ఆడి.. 139 వికెట్లు పడగొట్టాడు. మరి కష్టాల్లో ఉన్న గుజరాత్ టీమ్ లోకి రషీద్ వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: ఇది క్రికెట్​ కాదు.. అంతకుమించి! ఈ బుడ్డోళ్ల ఆటకు ఫిదా అవ్వాల్సిందే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి