Somesekhar
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా దారుణంగా విఫలమైంది. పటిష్టమైన టీమిండియా టాపార్డర్ ప్రోటీస్ పేస్ దళం ముందు నిలవలేకపోయింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా దారుణంగా విఫలమైంది. పటిష్టమైన టీమిండియా టాపార్డర్ ప్రోటీస్ పేస్ దళం ముందు నిలవలేకపోయింది.
Somesekhar
సౌతాఫ్రికా గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెంచూరియన్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన సఫారీ టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాకుల మీద షాకులు తగిలాయి. పటిష్టమైన టీమిండియా టాపార్డర్ ప్రోటీస్ పేస్ దళం ముందు నిలవలేకపోయింది. వర్షం కారణంగా పిచ్ నుంచి వస్తున్న సహకారన్ని దక్షిణాఫ్రికా బౌలర్లు చక్కగా వినియోగించుకుంటూ.. టీమిండియాను దెబ్బ కొట్టారు. దీంతో కేవలం 24 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా దారుణంగా విఫలమైంది. సఫారీ పేస్ పిచ్ లపై భారత బ్యాటర్లు నిలవలేరన్న మాటలను నిజం చేస్తూ.. కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సపారీ బౌలర్ల ధాటికి తట్టుకోలక చేతులెత్తేశారు టీమిండియా స్టార్ బ్యాటర్లు. విశ్రాంతి తర్వాత జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మన్ 5 పరుగులకే కగిసో రబాడ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్(17)ను నండ్రే బర్గర్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన యంగ్ సెన్సేషన్ శుబ్ మన్ గిల్(2)ని కూడా బర్గర్ పెవిలియన్ చేర్చి.. టీమిండియా ను దారుణంగా దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజ్ లో విరాట్ కోహ్లీ(4), శ్రేయస్ అయ్యర్(8) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి సఫారీ పేస్ ను తట్టుకోలేక కుప్పకూలిన భారత టాపార్డర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma dismissed for 5 in 14 balls. pic.twitter.com/ZiKCDtfYOl
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023
Shubman Gill dismissed for 2 in 12 balls. pic.twitter.com/yBO4mvLDJa
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023