iDreamPost
android-app
ios-app

Sachin Tendulkar: క్రికెట్ దేవుడని ఊరికే అనలేదు.. వైరల్​గా మారిన సచిన్ ప్రాక్టీస్ వీడియో!

  • Published May 02, 2024 | 6:08 PM Updated Updated May 02, 2024 | 6:08 PM

క్రికెట్​లో ఎంతో మంది ప్లేయర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొన్ని తరాలు గుర్తుపెట్టుకునే ఆటగాళ్లు ఏ నలుగురైదుగురో ఉంటారు. అందులో ఫస్ట్ ప్లేస్​లో ఉంటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

క్రికెట్​లో ఎంతో మంది ప్లేయర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొన్ని తరాలు గుర్తుపెట్టుకునే ఆటగాళ్లు ఏ నలుగురైదుగురో ఉంటారు. అందులో ఫస్ట్ ప్లేస్​లో ఉంటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

  • Published May 02, 2024 | 6:08 PMUpdated May 02, 2024 | 6:08 PM
Sachin Tendulkar: క్రికెట్ దేవుడని ఊరికే అనలేదు.. వైరల్​గా మారిన సచిన్ ప్రాక్టీస్ వీడియో!

క్రికెట్​లో ఎంతో మంది ప్లేయర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొన్ని తరాలు గుర్తుపెట్టుకునే ఆటగాళ్లు ఏ నలుగురైదుగురో ఉంటారు. అందులో ఫస్ట్ ప్లేస్​లో ఉంటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. దాదాపు పాతికేళ్ల కెరీర్. ఎన్నో వందల మ్యాచుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం. టన్నుల కొద్దీ పరుగులు. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 100 సెంచరీలు. లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు. అతడి బ్యాటింగ్ కోసం దేశం మొత్తం ఎదురుచూసేది. టీమిండియా గెలిచిందా? ఓడిందా? అనే దాని కంటే సచిన్ సెంచరీ కొట్టాడా? అనేది అప్పట్లో అందరూ ఎక్కువగా డిస్కస్ చేసుకునేవారు. అతడు ఆడుతున్నాడంటే పనులన్నీ మానుకొని టీవీల ముందు వాలిపోయేవారు. తన ఆటతో కోట్లాది మందిని అలరించిన సచిన్.. ఆ స్థాయికి ఎదగడానికి ఎంతో తీవ్రంగా కష్టపడ్డాడు. దీనికి సాక్ష్యమే ఈ వీడియో.

ఇప్పుడు అంటే ఎక్కడ చూసినా ఫ్లాట్ వికెట్స్ దర్శనమిస్తున్నాయి. దీంతో బ్యాటర్లు ఈజీగా రన్స్ చేస్తున్నారు. కానీ 1990, 2000వ దశకంలో పిచ్​లను బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​కు కూడా అనుకూలించేలా సిద్ధం చేసేవారు. వికెట్ నుంచి పేస్, స్వింగ్​కు హెల్ప్ లభించేలా చూసేవారు. అప్పట్లో వసీం అక్రమ్, బ్రెట్​ లీ, షోయబ్ అక్తర్, గ్లెన్ మెక్​గ్రాత్, డేల్ స్టెయిన్ లాంటి డేంజరస్ బౌలర్లు ఉండేవారు. వాళ్లను ఎదుర్కొని రన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉన్న సచిన్ వీళ్లను అవలీలగా ఫేస్ చేసేవాడు. కఠినమైన పిచ్​ల మీద, డేంజరెస్ బౌలర్లను ఎదుర్కొని వేలాది పరుగులు చేశాడు. అయితే అతడ్ని కూడా కొందరు బౌలర్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో కఠోరంగా శ్రమించేవాడు మాస్టర్ బ్లాస్టర్. తన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు గంటల కొద్దీ నెట్స్​లో ప్రాక్టీస్ చేసేవాడు.

పేసర్ల బౌలింగ్​లో ఈజీగా రన్స్ చేసేందుకు నీళ్లతో కూడిన పిచ్ మీద కూడా సాధన చేశాడు సచిన్. దీనికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో అటు నుంచి బౌలర్లు బౌన్సర్లను సంధిస్తున్నారు. నీళ్లలో పడిన బంతి వేగంగా వస్తుండగా దాన్ని షాట్ కొడుతూ కనిపించాడు సచిన్. నీళ్లు ముఖం మీద పడుతున్నా, బంతి మీద నుంచి అతడు చూపు తిప్పుకోకుండా షాట్లు ఆడటం అద్భుతమనే చెప్పాలి. ఇది ఏ సిరీస్​కు సంబంధించిన వీడియోనో తెలియదు గానీ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ అందుకే సచిన్​ను గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారని.. ఊరికే లెజెండ్స్ అయిపోరని కామెంట్స్ చేస్తున్నారు. నిత్యం మెరుగవుతూ, తప్పులను సరిదిద్దుకుంటూ నిలబడ్డాడు కాబట్టే అత్యున్నత శిఖరాలను అతడు అధిరోహించాడని మెచ్చుకుంటున్నారు. మరి.. సచిన్ ప్రాక్టీస్ వీడియోపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Krishhari10 (@kris.hhari10)