Somesekhar
WTC 2025 Australia is getting tension: బంగ్లాదేశ్ పై టీమిండియా తొలి టెస్ట్ లో విజయం సాధించడంతో.. ఆస్ట్రేలియాలో టెన్షన్ మెుదలైంది. దాంతో పాటుగా న్యూజిలాండ్ ను శ్రీలంక చిత్తు చేయడంతో ఆ టెన్షన్ ఇంకాస్త ఎక్కువైంది.
WTC 2025 Australia is getting tension: బంగ్లాదేశ్ పై టీమిండియా తొలి టెస్ట్ లో విజయం సాధించడంతో.. ఆస్ట్రేలియాలో టెన్షన్ మెుదలైంది. దాంతో పాటుగా న్యూజిలాండ్ ను శ్రీలంక చిత్తు చేయడంతో ఆ టెన్షన్ ఇంకాస్త ఎక్కువైంది.
Somesekhar
టీమిండియా తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే బంగ్లాపై భారత్ విజయం సాధించడంతో ఆస్ట్రేలియా జట్టులో టెన్షన్ మెుదలైంది. ఆ ఆందోళన కాస్త.. న్యూజిలాండ్ పై 63 పరుగుల తేడాతో శ్రీలంక గెలవడంతో.. ఎక్కువైందనే చెప్పాలి. అదేంటి? బంగ్లాపై భారత్ విజయం, కివీస్ పై శ్రీలంక గెలిస్తే ఆసీస్ జట్టు ఎందుకు టెన్షన్ పడుతుంది? అని మీరు అనుకోవచ్చు. దానికి ఓ బిగ్ రీజన్ ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టీమిండియా చేతిలో ఓడిపోయిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా కొంపముంచింది. అవును వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 పాయింట్ల పట్టికలో శరవేగంగా జట్ల స్థానాలు మారుతున్నాయి. దాంతో ఫైనల్ బెర్త్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇక బంగ్లాపై విజయంతో టీమిండియా తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 10 మ్యాచ్ లు ఆడి 86 పాయింట్లతో 71.67 శాతంతో టాప్ లో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా 12 మ్యాచ్ లు 90 పాయింట్లు, 62.50 శాతంతో రెండో ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం టీమిండియా జోరు చూస్తుంటే ముచ్చటగా మూడోసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ.. సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియా మాత్రం ధైర్యంగా ఉండలేక టెన్షన్ పడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. త్వరలో జరగబోయే బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కోల్పోతే ఆసీస్ ప్రమాదంలో పడ్డట్లే.
ఆస్ట్రేలియా టీమిండియాతో పాటుగా శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే సొంత గడ్డపై లంకను ఓడించడం అంత ఈజీకాదనే చెప్పాలి. పైగా ప్రస్తుతం ఆ టీమ్ అద్భుతంగా ఆడుతోంది. ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి, సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్ లో సత్తాచాటి చివర్లో ఆసీస్ ను కంగుతినిపిస్తే.. మూడో స్థానంలో ఉన్న లంక ఆసీస్ కు దగ్గరగా వస్తుంది. ఇక బంగ్లాదేశ్ తమ ఓటములతో ఆసీస్ ను మరింత టెన్షన్ కు గురిచేస్తోంది. పాక్ ను చిత్తు చేసిన బంగ్లా.. అదే జోరుతో టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని, దాంతో తమ విజయశాతానికి భారత్ జట్టు దగ్గర అవుతుందని కంగారూ టీమ్ భావించింది కానీ.. అది జరగలేదు. దాంతో కంగారూ టీమ్ కంగారు పడుతోంది. ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ (71.67 %), ఆస్ట్రేలియా (62.50 %), శ్రీలంక (50 %), న్యూజిలాండ్ (42.85 %), ఇంగ్లండ్ (42.19 %), బంగ్లాదేశ్ (39.29 %), దక్షిణాఫ్రికా (38.89 %), పాకిస్థాన్ (19.05 %), వెస్టిండీస్ (18.52 %) వరుసగా ఉన్నాయి. చూడాలి మరి ఆ ఒక్క ప్లేస్ ను ఏ జట్టు దక్కించుకుంటుందో.
WTC Points Table.
– India ruling at the Top. 🇮🇳 pic.twitter.com/a0wlTK1cry
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2024