iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డికి గంభీర్ బంపరాఫర్.. కానీ, ఆ ఒక్కడే అడ్డు!

  • Published Sep 23, 2024 | 12:27 PM Updated Updated Sep 23, 2024 | 12:27 PM

Gautam Gambhir, Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బంపరాఫర్ ఇచ్చాడు. కానీ దాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Gautam Gambhir, Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బంపరాఫర్ ఇచ్చాడు. కానీ దాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Gautam Gambhir: తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డికి గంభీర్ బంపరాఫర్.. కానీ, ఆ ఒక్కడే అడ్డు!

టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తన మార్క్ వ్యూహాలతో ముందుకెళ్తున్నాడు. ఇక అతడు హెడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్ లోనే సూపర్ సెక్సెస్ అయ్యాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఆ తర్వాత వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇక తాను హెడ్ కోచ్ అయ్యాక ఆడిన తొలి టెస్ట్ లో కూడా భారత్ కు విజయాన్ని అందించాడు గంభీర్. బంగ్లాదేశ్ తో జరిగిన ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా గంభీర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డికి బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రస్తుతం టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారని, కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు లేరని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇందుకోసం డొమెస్టిక్ క్రికెట్ లో స్పీడ్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం అన్వేషించాలని తెలిపాడు. దాంతో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి త్వరలోనే టీమిండియా నుంచి పిలుపు రావొచ్చని అందరూ అనుకుంటున్నారు. పేస్ బౌలింగ్ తో పాటుగా భారీ సిక్సర్లు బాదడంలో నేర్పరి నితీశ్ కుమార్. దాంతో పాటుగా ఫీల్డింగ్ లో సైతం అబ్బురపరిచే విన్యాసాలు చేయగలడు. గంభీర్ కోరుకునే అన్ని నైపుణ్యలు ఇతడిలో ఉన్నాయి. కానీ.. ఇతడు టీమిండియాలోకి రావడం కొంచెం కష్టమనే చెప్పాలి.

ప్రస్తుతం టీమిండియాలో పేస్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అతడు రెడ్ బాల్ తో కఠోర సాధన చేస్తూ.. టెస్టు జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. నితీశ్ రెడ్డికి పాండ్యా అడ్డుగా ఉన్నాడు. అయితే ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో నితీశ్ నిరాశపరిచాడు. 5 ఇన్నింగ్స్ ల్లో రెండు సార్లు డకౌట్ గా వెనుదిరిగి కేవలం 61 పరుగులే చేశాడు. ఇక బ్యాటింగ్ లో నిరాశపరిచిన నితీవ్ బౌలింగ్ లో రాణిస్తాడనుకుంటే.. అక్కడ కూడా పేలవంగా ముగించాడు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. దాంతో సెలెక్టర్ల దృష్టికి దూరంగా పోయాడు. గంభీర్ బంపరాఫర్ ఇచ్చినప్పటికీ.. దాన్ని ఇతడు అందుకోలేకపోతున్నాడు. కాగా.. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. గాయం కారణంగా చివరి నిమిషయంలో దూరమైయ్యాడు. అయితే బంగ్లాదేశ్ తో త్వరలోనే జరగబోయే టీ20 సిరీస్ కు ఇతడు సెలెక్ట్ అయ్యి.. సత్తా చాటితే.. మాత్రం గంభీర్ ఈ పేస్ ఆల్ రౌండర్ ను టీమిండియాలోకి వేగంగా తీసుకొచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.