iDreamPost
android-app
ios-app

టీమిండియాపై కక్ష గట్టిన ICC! వరల్డ్ కప్ షెడ్యూల్ లో తీరని అన్యాయం..

  • Author Soma Sekhar Published - 05:42 PM, Sat - 1 July 23
  • Author Soma Sekhar Published - 05:42 PM, Sat - 1 July 23
టీమిండియాపై కక్ష గట్టిన ICC! వరల్డ్ కప్ షెడ్యూల్ లో తీరని అన్యాయం..

వరల్డ్ కప్ 2023.. ప్రస్తుతం అన్ని దేశాల చూపు ఈ మెగా టోర్నీపైనే. ఇక ఇప్పటి నుంచే ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి జట్లు. కాగా.. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయ్యిందని ఫ్యాన్స్ అంతా సంతోషిస్తుంటే.. టీమిండియా అభిమానులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దానికి కారణం ఐసీసీ రిలీజ్ చేసిన షెడ్యూలే. ఈ షెడ్యూల్ ను పరిశీలించిన అభిమానులు ICC టీమిండియాపై కక్షగట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఐసీసీ భారత్ పై కక్ష గట్టిందా? వరల్డ్ కప్ షెడ్యూల్ లో భారత్ కు అన్యాయం జరిగిందా? ఇప్పుడు తెలుసుకుందాం.

2023 ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం మెుత్తం 10 వేదికలను బీసీసీఐ సెలక్ట్ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు కథ మెుదలైంది. ఈ పది వేదికల్లో అన్ని జట్లు కొన్ని స్టేడియాల్లో రెండేసి మ్యాచ్ లు ఆడబోతున్నాయి. టీమిండియా వరకు వచ్చే సరికి.. తాను ఆడే 9 మ్యాచ్ లు 9 వేరు వేరు మైదానాల్లో ఆడనుంది. ఈ వరల్డ్ కప్ లో ఇన్ని గ్రౌండ్స్ మధ్య ప్రయాణిస్తూ.. ఇన్ని చోట్ల ఆడే ఒకే ఒక్క జట్టు టీమిండియా మాత్రమే.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? టీమిండియా కేవలం లీగ్ దశలోనే ఏకంగా 8400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దాంతో తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి ఆటగాళ్లలో కచ్చితంగా ఉంటుంది. లీగ్ దశలోనే 34 రోజుల్లోనే టీమిండియా 8400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అదీకాక గుహవాతి, త్రివేండ్రంలో వార్మప్ మ్యాచ్ లు అదనంగా ఆడాల్సి వస్తోంది. కాగా.. ఐసీసీ ఎంత దారుణంగా ఆలోచించిదంటే? టోర్నీలో తొలి మ్యాచ్ ను చెన్నైలో ఆడి.. రెండో మ్యాచ్ కోసం అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాలి. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఏకంగా 1761 కిలోమిటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఇలా తీరికలేని, దూర ప్రయాణాల వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనౌతారని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇలాగైతే టీమిండియా ఎలా కప్పు కొడుతుంది? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

అయితే మిగతా జట్లు మాత్రం కొన్ని నగరాల్లో వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దాంతో వారు అక్కడి పరిస్థితులను, పిచ్ ను అర్ధం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇదంతా తెలిసిన టీమిండియా అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఇలా షెడ్యూల్ ను ప్రిపేర్ చేసిన ఐసీసీపై తీవ్రంగా మండి పడుతున్నారు. ఒకవేళ టీమిండియా వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన ఇవ్వకపోతే.. ఈ షెడ్యూల్ కూడా ఒక కారణం అవుతుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక మరికొంత మంది అభిమానులు భారత్ పై ఐసీసీ కక్ష గట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.