iDreamPost
android-app
ios-app

టీమిండియాకు ప్రతి ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్​లో రెస్ట్! బలమైన కారణాలే ఉన్నాయి..

  • Published Aug 14, 2024 | 4:33 PM Updated Updated Aug 14, 2024 | 4:33 PM

Team India: భారత క్రికెట్​ జట్టుకు ఇప్పుడు మ్యాచ్​లు ఏమీ లేవు. దీంతో ఆటగాళ్లు రెస్ట్ తీసుకుంటున్నారు. కొందరు వెకేషన్స్​లో బిజీగా ఉంటే.. మరికొందరు ప్లేయర్లు ఇంటి వద్దే ఉంటూ ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు.

Team India: భారత క్రికెట్​ జట్టుకు ఇప్పుడు మ్యాచ్​లు ఏమీ లేవు. దీంతో ఆటగాళ్లు రెస్ట్ తీసుకుంటున్నారు. కొందరు వెకేషన్స్​లో బిజీగా ఉంటే.. మరికొందరు ప్లేయర్లు ఇంటి వద్దే ఉంటూ ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు.

  • Published Aug 14, 2024 | 4:33 PMUpdated Aug 14, 2024 | 4:33 PM
టీమిండియాకు ప్రతి ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్​లో రెస్ట్! బలమైన కారణాలే ఉన్నాయి..

భారత క్రికెట్​ జట్టుకు ఇప్పుడు మ్యాచ్​లు ఏమీ లేవు. దీంతో ఆటగాళ్లు రెస్ట్ తీసుకుంటున్నారు. కొందరు వెకేషన్స్​లో బిజీగా ఉంటే.. మరికొందరు ప్లేయర్లు ఇంటి వద్దే ఉంటూ ఫ్యామిలీతో సమయం గడుపుతున్నారు. వచ్చే నెలలో బంగ్లాదేశ్​తో మొదలయ్యే టెస్ట్ సిరీస్ వరకు మెన్ ఇన్ బ్లూ విశ్రాంతి తీసుకోనున్నారు. ఇంకో నెల రోజులు భారత జట్టు మ్యాచ్​లు ఉండవు. ఎప్పుడూ ఏదో ఒక సిరీస్​లో ఆడుతూ బిజీగా ఉండే టీమిండియా క్రికెటర్లు.. ప్రతి ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ విండోలో మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు. ఎడతెరపిలేని క్రికెట్ ఆడి అలసిపోవడం వల్ల ఆటగాళ్లకు ప్రతి ఏటా ఈ టైమ్​లో భారత క్రికెట్ బోర్డు విశ్రాంతి ఇస్తోందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దీని వెనుక అసలు నిజం వేరే ఉంది.

ఆగస్టు-సెప్టెంబర్ విండోలో మాత్రమే టీమిండియా మ్యాచ్​లు లేకుండా ప్లేయర్లకు రెస్ట్ దొరికేలా ప్రతి ఏడాది షెడ్యూల్​ను రూపొందిస్తోంది బీసీసీఐ. ఇదేదో అనుకోకుండా చేస్తుందని అనుకోవద్దు. గత కొన్నేళ్లుగా సరిగ్గా అదే నెలల్లో మ్యాచ్​లు లేకుండా చేయడం వెనుక బోర్డు పెద్దల పక్కా ప్లానింగ్ ఉంది. ప్రతి సంవత్సరం ఈ రెండు నెలల్లో భారత జట్టుకు భారీ బ్రేక్ ఇవ్వడడానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. అప్పట్లో ఛాంపియన్స్ లీగ్ కోసం ఈ రెండు నెలల మధ్య స్లాట్ కేటాయించింది భారత బోర్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు, ఇతర లీగ్స్​లో ఆడే బెస్ట్ టీమ్స్​తో కలిపి ఈ టోర్నమెంట్​ను నిర్వహిస్తూ వచ్చారు. అయితే 2008 నుంచి 2014 వరకు జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

ఛాంపియన్స్ లీగ్ కోసం ఆగస్టు-సెప్టెంబర్​ విండోలో ఇంటర్నేషనల్ మ్యాచ్​లు లేకుండా చూసుకుంటూ వచ్చిన బీసీసీఐ.. ఆ టోర్నీ ముగిసిన తర్వాత కూడా ఇదే కల్చర్​ను కంటిన్యూ చేస్తోంది. ఆగిపోయిన ఛాంపియన్స్ లీగ్ స్థానంలో మినీ ఐపీఎల్ నిర్వహించాలని భారత బోర్డు పెద్దలు చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఐపీఎల్​లో ప్లేఆఫ్స్​ చేరిన టీమ్స్​తో ఈ లీగ్​ను జరపాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఆగస్టు-సెప్టెంబర్​లో మ్యాచ్​లు లేకుండా ఖాళీగా ఉంచుతున్నారని వినిపిస్తోంది. ఒకవేళ ఫ్యూచర్​లో ఈ టోర్నమెంట్ కార్యరూపం దాలిస్తే.. భారత జట్టు ఆటగాళ్లు అందులో ఆడుతూ బిజీగా అయిపోతారు. అయితే ఇంత ఎక్కువ క్రికెట్ ఆడే ప్లేయర్లకు మినీ ఐపీఎల్ వల్ల ఆ కాస్త రెస్ట్ కూడా లేకుండా పోతుందని, అది వాళ్ల కెరీర్​కు ప్రమాదకరమని ఎక్స్​పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు.