iDreamPost
android-app
ios-app

Hardik Pandya: బ్రిటీష్ సింగర్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్? వైరల్ అవుతున్న పోస్ట్..

  • Published Aug 14, 2024 | 12:24 PM Updated Updated Aug 14, 2024 | 12:24 PM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ బ్రిటీష్ సింగర్ తో డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలు రావడానికి కారణం వారిద్దరు పెట్టిన ఇన్ స్టా పోస్ట్ లే. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ బ్రిటీష్ సింగర్ తో డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలు రావడానికి కారణం వారిద్దరు పెట్టిన ఇన్ స్టా పోస్ట్ లే. పూర్తి వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: బ్రిటీష్ సింగర్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్? వైరల్ అవుతున్న పోస్ట్..

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొన్ని రోజుల క్రితం తన భార్య నటాషా స్టాంకోవిచ్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తన కొడుకు అగస్త్యను తీసుకుని పుట్టిల్లు అయిన సెర్బియాకు వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. పాండ్యా బ్రిటీష్ సింగర్ కమ్ టీవీ నటి అయిన జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలు రావడానికి కూడా ఓ కారణం ఉందిలెండి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా బ్రిటీష్ సింగర్ అయిన జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఈ న్యూస్ రావడానికి ఓ ప్రత్యేక కారణమే ఉంది. తాజాగా పాండ్యా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. గ్రీస్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తున్న వీడియో అది. ఇందులో తప్పేముంది? అన్న అనుమానం మీకు రావొచ్చు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నాలుగు రోజుల ముందు జాస్మిన్ వాలియా కూడా సేమ్ ఇదే పూల్ దగ్గర ఫొటోలు దిగి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అదీకాక ఆమె పోస్ట్ లకు పాండ్యా లైక్స్ కూడా కొట్టాడు. ఇంకేముంది ఇద్దరు కలిసే వెకేషన్ కు వెళ్లినట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

hardik pandya dating with singer

మామూలుగా ఇద్దరు కలిసి ఎక్కడైనా కనిపిస్తేనే ప్రేమ పుకార్లు షికార్లు చేస్తాయి. అలాంటిది ఒకే లొకేషన్లలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అంటున్నారు నెటిజన్లు. కాగా.. జాస్మిన్ వాలియా విషయానికి వస్తే.. ఇంగ్లండ్ లో  ఎస్సెక్స్ ప్రాంతానికి చెందిన జాస్మిన్ ఫస్ట్ టీవీ సిరీస్ ల్లో నటించి.. ఆ తర్వాత పలు రియాల్టీ షోల్లో పాల్గొని ఆడియెన్స్ కు దగ్గరైంది. 2014లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి, పలు ఆల్బమ్ లు చేసింది. ఆమె పాడిన ‘బామ్  డీగి’ పాటను ఓ బాలీవుడ్ మూవీలో రీమేక్ చేశారు. మరి బ్రిటీష్ సింగర్ తో పాండ్యా డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Walia (@jasminwalia)

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)