SNP
టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ఆడిన భారత మాజీ క్రికెటర్ తాజాగా 1.9 కోట్ల వివాదంలో చిక్కుకుని అరెస్ట్ అయ్యారు. అయితే.. ఆయన ఏ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఎవరు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ఆడిన భారత మాజీ క్రికెటర్ తాజాగా 1.9 కోట్ల వివాదంలో చిక్కుకుని అరెస్ట్ అయ్యారు. అయితే.. ఆయన ఏ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఎవరు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
1.9 కోట్ల వివాదంలో సచిన్ టెండూల్కర్ టీమ్‌మేట్ అరెస్ట్ అయ్యాడు. 90ల్లో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ లాంటి స్టార్లతో కలిసి క్రికెట్ ఆడిన భారత మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్యను నాగ్‌పూర్ పోలీసులు నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌తో అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1995-96లో టీమిండియా తరఫున ఆడిన ప్రశాంత్ వైద్య.. క్రికెటర్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే.. ఇటీవల ఓ వ్యాపారి నుంచి ప్రశాంత్ స్టీల్ కొనుగోలు చేశాడు. అందుకు గాను 1.9 కోట్లు వ్యాపారికి చెల్లింపులుగా పలు చెక్కలు ఇచ్చాడు ప్రశాంత్.
అయితే.. చెక్ బౌన్స్ కావడంతో సదరు వ్యాపారి ప్రశాంత్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఆయనపై చెక్ బౌన్స్ కేసు పెట్టడంతో నాగ్‌పూర్ పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి.. కోర్టుకు హాజరు పర్చేముందుకు ష్యూరిటీ బాండ్‌పై విడుదల చేశారు. కాగా.. 1967లో జన్మించిన ప్రశాంత్.. బెంగాల్ తరఫున దేశవాళి క్రికెట్‌లో పేస్ బౌలర్‌గా రాణించి.. భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 1995-96 మధ్య టీమిండియా తరఫున నాలుగు వన్డేలు ఆడిన ప్రశాంత్.. నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు. ఆయన ఆడే సమయంలో టీమిండియా అందరి కంటే ఫాస్ట్‌గా బౌలింగ్ వేసే బౌలర్‌గా పేరుతెచ్చుకున్నాడు.
ఇక దేశవాళి క్రికెట్‌లో మాత్రం ప్రశాంత్ వైద్య మంచి బౌలర్‌గానే ఉన్నాడు. తన కెరీర్‌లో 56 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన 171 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత విదర్భ క్రికెట్ అసోసియేషన్ కోచింగ్ అకాడమీని అభివృద్ధి చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. దేశవాళి క్రికెట్‌లో రాణించినప్పటికీ.. ఆ తర్వాత భారత జట్టులో మాత్రం తన స్థానం సుస్థిరం చేసుకోలేక ఒక అనామక క్రికెటర్‌గా మిగిలిపోయాడు. కానీ, ఇప్పుడు ఈ వివాదంలో చిక్కుకుని మళ్లీ వార్తల్లో నిలిచాడు. మరి భారత మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్య చెక్ బౌన్స్ కేసు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.