iDreamPost
android-app
ios-app

DSPగా టీమిండియా క్రికెటర్‌.. స్టార్ ఆల్​రౌండర్​కు అరుదైన గౌరవం!

  • Published Jan 30, 2024 | 5:23 PM Updated Updated Jan 30, 2024 | 5:23 PM

ఓ టీమిండియా క్రికెటర్​కు అరుదైన గౌరవం దక్కింది. ఆ స్టార్ ఆల్​రౌండర్​ను ప్రభుత్వం డీఎస్సీ హోదాతో సత్కరించింది.

ఓ టీమిండియా క్రికెటర్​కు అరుదైన గౌరవం దక్కింది. ఆ స్టార్ ఆల్​రౌండర్​ను ప్రభుత్వం డీఎస్సీ హోదాతో సత్కరించింది.

  • Published Jan 30, 2024 | 5:23 PMUpdated Jan 30, 2024 | 5:23 PM
DSPగా టీమిండియా క్రికెటర్‌.. స్టార్ ఆల్​రౌండర్​కు అరుదైన గౌరవం!

ఆటల్లో బాగా రాణించిన వారికి పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు, ఉద్యోగం లాంటివి కూడా వస్తాయి. అందుకే చాలా మంది పిల్లలు, యువత స్పోర్ట్స్​ను తమ కెరీర్​గా మలచుకుంటారు. నచ్చిన ఆటలో ప్రాణం పెట్టేస్తారు. మన దేశంలో ఎక్కువ మంది క్రికెట్​ను కెరీర్​గా సెలక్ట్ చేసుకుంటారు. క్రికెట్ వల్ల ఎందరో ఆటగాళ్లు ఓవర్​నైట్ స్టార్లు అయ్యారు. రూ.కోట్లకు కోట్లు సంపాదనతో పాటు వెలకట్టలేని కోట్లాది మంది అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు. ఒకవైపు క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ ఉద్యోగం వస్తే దాన్ని కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. స్టార్ క్రికెటర్లకు ప్రభుత్వ సంస్థలు పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తుంటాయి. ఇప్పుడు ఓ విమెన్ క్రికెటర్​కు అలాగే సర్కారు నౌకరీ వచ్చింది. మహిళల క్రికెట్​లో ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో దుమ్మురేపుతున్న దీప్తి శక్మకు అరుదైన గౌరవం లభించింది. యూపీ ప్రభుత్వం ఆమెను డీఎస్సీ హోదాతో సత్కరించింది.

ఇంటర్నేషనల్ క్రికెట్​లో నిలకడగా రాణిస్తున్న దీప్తి శర్మకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాతో సత్కరించింది. విమెన్స్ క్రికెట్​లో కంటిన్యూస్​గా పెర్ఫార్మ్ చేస్తూ భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది దీప్తి. ఆమె ప్రదర్శనలకు గుర్తింపుగానే ఈ గౌరవం లభించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో పాటు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంయుక్తంగా దీప్తీకి అపాయింట్​మెంట్ లెటర్​ను అందించారు. అలాగే రూ.3 కోట్ల నగదును కూడా ఆమెకు గిఫ్ట్​గా ఇచ్చారు. తనను డీఎస్పీగా నియమించడంపై దీప్తి రియాక్ట్ అయింది. ఉత్తర్​ప్రదేశ్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన స్టార్ ఆల్​రౌండర్.. ఆగ్రాతో పాటు మరిన్ని నగరాల్లో మహిళా క్రికెట్​ను మరింతగా ఎంకరేజ్ చేస్తానని తెలిపింది. కాగా, 2023లో చైనాలో జరిగిన ఏషియా గేమ్స్​లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న దీప్తి.. ఇంగ్లండ్ వేదికగా బర్మింగ్​హామ్​లో జరిగిన కామన్​వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్​ను కైవసం చేసుకుంది.

ఇటీవలే దీప్తి శర్మ అరుదైన అవార్డును దక్కించుకుంది. డిసెంబర్ 2023లో అసాధారణమైన ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టినందుకు గానూ ఆమె ఐసీసీ ప్లేయర్ ఆఫ్​ ది మంత్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్​గా నిలిచింది. ఇక, కెరీర్ విషయానికొస్తే.. దీప్తి ఇప్పటిదాకా 86 వన్డేలు ఆడింది. అందులో 1982 పరుగులు చేసి, 100 వికెట్లు పడగొట్టింది. 104 టీ20ల్లో 1,015 పరుగులు చేయడంతో పాటు 113 వికెట్లు తీసింది. 4 టెస్టుల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించిన దీప్తి 317 రన్స్ చేసి 16 వికెట్లు నేలకూల్చింది. టీ20 క్రికెట్​లో 1,000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన తొలి టీమిండియా క్రికెటర్​గా ఆమె రికార్డు నెలకొల్పింది. అలాంటి దీప్తీకి డీఎస్పీ హోదా దక్కడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది ఆమె ప్రతిభ, కష్టానికి దక్కిన గౌరవం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. దీప్తి శర్మను డీఎస్పీగా నియమిస్తూ యూపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.