ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను గెలుచుకున్న భారత్.. తాజాగా వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో విండీస్ ను చిత్తుచేసింది. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది టీమిండియా. దీంతో ప్రపంచంలోనే ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో సీనియర్లు లేకపోయినా.. యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణించి భారీ విజయం అందించారు. మరి టీమిండియా సాధించిన ఆ అరుదైన రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత బ్యాటర్లు, బౌలర్లు రెచ్చిపోయారు. దాంతో విండీస్ వణికిపోయింది. తొలుత బ్యాటర్లు తమ సత్తాచూపించగా.. తర్వాత బౌలర్లు తమ ప్రతాపం చూపారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్లు శుబ్ మన్ గిల్ (85), ఇషాన్ కిషన్ (77) శాంసన్ (51), తాత్కాలిక కెప్టెన్ హార్దిప్ పాండ్యా (70*) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో.. టీమిండియా భారీ స్కోర్ చేసింది. అనంతరం 352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. భారత బౌలర్ల ధాటికి 151 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. కొత్త కుర్రాడు ముకేశ్ కుమార్ 3 వికెట్లతో రాణించాడు.
ఇక ఈ సిరీస్ గెలవడం ద్వారా వరుసగా.. విండీస్ పై 13 ద్వైపాక్షిక సిరీర్ లు (2007-2023) గెలిచన జట్టుగా చరిత్ర సృష్టించింది భారత జట్టు. దీంతో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక ద్వైపాక్షిక సిరీస్ లు గెలిచి ప్రపంచంలోనే ఏకైక జట్టుగా నిలిచింది టీమిండియా. ఈ లిస్ట్ లో వరుసగా 11 వన్డే సిరీస్ లను జింబాబ్వేపై గెలిచి రెండో స్థానంలో ఉంది పాకిస్థాన్. మరి వరుసగా 13 సిరీస్ లు ఒకే జట్టుపై గెలిచిన టీమిండియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
From 1-1 to 2-1! 👏 🏆
The smiles say it all! ☺️ ☺️ #TeamIndia | #WIvIND pic.twitter.com/M3oQLNUOg0
— BCCI (@BCCI) August 2, 2023
ఇదికూడా చదవండి: విండీస్ తో మ్యాచ్.. అరుదైన ఘనత సాధించిన ఇషాన్ కిషన్!