Uppula Naresh
వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆదివారం బెంగుళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో భారత్, నెదర్లాండ్ తలపడ్డాయి. ఇక మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డ్ ఏంటంటే?
వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆదివారం బెంగుళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో భారత్, నెదర్లాండ్ తలపడ్డాయి. ఇక మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డ్ ఏంటంటే?
Uppula Naresh
వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా టీమిండియా వరుస విజయాలతో విజయదుందుభి మెగిస్తూ ప్రత్యర్థి జట్లకు చుక్కులు చూపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో అన్నింట గెలిచి సరికొత్త రికార్డ్ దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విధ్వంసకర ఆట తీరుతో అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. ఇంతే కాకుండా ఆటగాళ్లకు తనదైన శైలీలో సూచనలు చేస్తూనే తన ఆట తీరును సైతం రోజు రోజకు మరింత మెరుగు పరుచుకుంటున్నాడు. ఇక ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ హిట్ మ్యాన్ ఏదో ఒక రికార్డ్ ను చెరిపేస్తూ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు అయితే, తాజాగా రోహిత్ మరో రికార్డును నెలకొల్పాడు.
వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆదివారం బెంగుళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఇండియా, నెదర్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. వన్డ్ ప్రపంచ కప్ 2023లోనే రోహిత్ శర్మ ఏకంగా 59 సిక్స్ లు బాది సరికొత్త రికార్డును నెలకోల్పాడు. ఇలా ఒకే ఏడాదిలో ఇన్ని సిక్సర్లు బాదిన ఆటగాడు క్రికెటర్ చరిత్రలోనే లేకపోవడం విశేషం. అయితే, రోహిత్ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడైన ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. మరో విషయం ఏంటంటే? ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓపెనర్ గా రోహిత్ శర్మ ఏకంగా 14000ల పరుగులు పిండుకుని మరోసారి తన సత్తా ఏంటో చెప్పకనె చెప్పాడు. ఇదిలా ఉంటే.. నేడు జరిగే మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించి ఈసారి పక్కా కప్ గెలుస్తుందని అభిమానులు ధీమ వ్యక్తం చేస్తున్నారు.