iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఆ భయం ఉంటే ఆడటం మానేయండి.. రోహిత్ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..?

  • Published Jan 19, 2024 | 7:49 PM Updated Updated Jan 19, 2024 | 7:49 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భయం ఉన్నవాళ్లు ఆడటం మానేయాలని అన్నాడు. అసలు హిట్​మ్యాన్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భయం ఉన్నవాళ్లు ఆడటం మానేయాలని అన్నాడు. అసలు హిట్​మ్యాన్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 19, 2024 | 7:49 PMUpdated Jan 19, 2024 | 7:49 PM
Rohit Sharma: ఆ భయం ఉంటే ఆడటం మానేయండి.. రోహిత్ కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించి..?

ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్ విజయంతో భారత జట్టు ఫుల్ జోష్​లో ఉంది. గతేడాది మొత్తం వన్డే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్​లో బిజీ అయిపోయింది టీమిండియా. దీంతో ఈ ఏడాది జూన్​లో ఆడబోయే టీ20 ప్రపంచ కప్​కు సన్నద్ధమయ్యేందుకు అంత టైమ్ దొరకలేదు. స్వదేశంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్​లతో పొట్టి ఫార్మాట్లలో పలు మ్యాచులు ఆడింది. కానీ టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఒక్క ఆఫ్ఘాన్ సిరీస్​లోనే ఆడారు. వీళ్లతో పాటు జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లాంటి కీలక ఆటగాళ్లు మిగిలిన సిరీస్​ల్లో ఆడలేదు. దీంతో టీ20 వరల్డ్ కప్​కు వెళ్లబోయే జట్టు ఎంపిక విషయంలో పూర్తి అవగాహన రాలేదు. ఆఫ్ఘాన్ సిరీస్​లో చేసిన కొన్ని ప్రయోగాలతో దీనిపై కొంత క్లారిటీ ఇచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టీమ్ ఇంకా ఖరారు కాలేదన్నాడు. అదే సమయంలో కొందరికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ భయం ఉండే ఆటగాళ్లు ఆడటం మానేయాలని అన్నాడు.

టీ20 క్రికెట్​లో పరుగులు చేయాలనే కసి ఉండాలని.. దూకుడు మంత్రాన్ని ఉపయోగించాలన్నాడు రోహిత్. ఔట్ అవుతాననే భయం ఉంటే టీ20 క్రికెట్​కు దూరంగా ఉండాలన్నాడు. ఆఫ్ఘాన్​తో చివరి టీ20లో విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్ దూకుడుగా రన్స్ చేయాలనే ఉద్దేశంతో ఆడి ఔట్ అయ్యారని రోహిత్ పేర్కొన్నాడు. అలా ఔట్ అయినప్పటికీ వాళ్లిద్దరి ఆలోచన మాత్రం సరైనదేనని వ్యాఖ్యానించాడు. ఔట్ అవుతాననే భయం ఉంటే పొట్టి ఫార్మాట్​కు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. దీంతో అసలు రోహిత్ ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడా? అని అందరూ ఆలోచనల్లో మునిగిపోయారు. అయితే టీమ్​లో ఎవరూ నిదానంగా ఆడొద్దని.. ఈ ఫార్మాట్​కు తగ్గట్లు అటాకింగ్ ఫార్ములాతో ముందుకెళ్లాలని స్పష్టం చేసే క్రమంలోనే అతడు ఇలా మాట్లాడి ఉండొచ్చని క్రికెట్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. స్లోగా ఆడటం వల్ల టీమ్​కు నష్టం తప్ప ఒరిగేదేమీ లేదనే ఉద్దేశంతోనే అతడు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని చెబుతున్నారు.

కాగా, టీ20 వరల్డ్ కప్​కు వెళ్లే భారత స్క్వాడ్​ మీద కూడా హిట్​మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పొట్టి ఫార్మాట్​లో జరిగే ప్రపంచ కప్​లో ఆడే 8 నుంచి 10 మంది ఆటగాళ్లు ఎవరనేది తనకు తెలుసునని చెప్పాడు రోహిత్. ‘టీ20ల్లో చాలా మంది యంగ్​స్టర్స్​ను పరిశీలించి చూస్తున్నాం. కానీ మెయిన్ టీమ్​ను సెలక్ట్ చేసినప్పుడు వీళ్లలో కొందర్ని తప్పించాల్సి ఉంటుంది. అది వాళ్లకు నిరాశ కలిగిస్తుందని తెలుసు. కానీ టీమ్​లో ఒక క్లారిటీ రావడం కోసం ఇలా చేయక తప్పదు. 25 నుంచి 30 మంది ప్లేయర్ల పూల్ నుంచి మేం వరల్డ్ కప్ టీమ్​ను సెలక్ట్ చేయాలి. అయితే మేం ఇంకా జట్టును ఖరారు చేయలేదు. కానీ మెగాటోర్నీలో ఆడబోయే ఎనిమిది నుంచి పది మంది ఆటగాళ్లు మా మైండ్​లో ఉన్నారు’ అని హిట్​మ్యాన్ చెప్పుకొచ్చాడు. అయితే వరల్డ్ కప్ గురించి మాట్లాడినప్పటికీ.. భయం ఉన్న ప్లేయర్లు ఈ ఫార్మాట్​లో ఆడటం మానేయాలని రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి.. హిట్​మ్యాన్ ఎవర్ని టార్గెట్ చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.