iDreamPost
android-app
ios-app

సూపర్-8లో టీమిండియాను ఢీకొట్టే జట్లపై క్లారిటీ.. ఆ ఒక్క టీమ్​తోనే డేంజర్!

  • Published Jun 16, 2024 | 1:02 PM Updated Updated Jun 16, 2024 | 1:02 PM

కెనడా మ్యాచ్ రిజల్ట్​తో సంబంధం లేకుండా సూపర్-8కు అర్హత సాధించింది టీమిండియా. గ్రూప్ దశ మ్యాచ్​లు ముగియడంతో నెక్స్ట్ స్టేజ్​లో ఎలా ఆడాలనే దానిపై కసరత్తులు చేస్తోంది.

కెనడా మ్యాచ్ రిజల్ట్​తో సంబంధం లేకుండా సూపర్-8కు అర్హత సాధించింది టీమిండియా. గ్రూప్ దశ మ్యాచ్​లు ముగియడంతో నెక్స్ట్ స్టేజ్​లో ఎలా ఆడాలనే దానిపై కసరత్తులు చేస్తోంది.

  • Published Jun 16, 2024 | 1:02 PMUpdated Jun 16, 2024 | 1:02 PM
సూపర్-8లో టీమిండియాను ఢీకొట్టే జట్లపై క్లారిటీ.. ఆ ఒక్క టీమ్​తోనే డేంజర్!

పొట్టి కప్పులో భారత జట్టు హవా నడుస్తోంది. అమెరికా గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి మన టీమ్​కు తిరుగులేకుండా పోయింది. ప్రాక్టీస్ మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. మెయిన్ మ్యాచెస్​లో హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టింది. మెగా టోర్నీలోని తొలి మ్యాచ్​లో ఐర్లాండ్​ను మట్టికరిపించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, యూఎస్​ఏను ఓడించింది. కెనడాతో ఆడాల్సిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో 7 పాయింట్లతో గ్రూప్ టాపర్​గా నిలిచిన టీమిండియా.. దర్జాగా సూపర్-8లోకి అడుగుపెట్టింది. ఇదే గ్రూప్ నుంచి అమెరికా కూడా నెక్స్ట్ స్టేజ్​కు క్వాలిఫై అయింది. ఈ నేపథ్యంలో సూపర్-8లో భారత్​ ఏయే జట్లతో తలపడబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లు ఒక రేంజ్​లో సాగితే.. సూపర్-8 పోరు నెక్స్ట్ లెవల్​లో సాగడం పక్కా అనే చెప్పాలి. ఎందుకంటే నాకౌట్ దశకు చేరుకోవాలంటే ఇక మీదట ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. సూపర్-8లో ప్రతి జట్టు మూడు మ్యాచ్​లు ఆడనుంది. అత్యధిక విజయాలు సాధించిన టీమ్స్, అలాగే నెట్ రన్​రేట్​ను బట్టి సెమీస్​కు చేరేవి ఏదనేది తేలుతుంది. సూపర్-8లో రోహిత్ సేనను ఢీకొట్టే జట్ల మీద క్లారిటీ వచ్చింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్​తో పాటు బంగ్లాదేశ్​/నెదర్లాండ్స్​లో ఒక టీమ్​తో టీమిండియా తలపడనుంది. సూపర్-8లో భాగంగా మొదట జూన్ 20వ తేదీన ఆఫ్ఘానిస్థాన్​తో తాడోపేడో తేల్చుకోనుంది భారత్. అనంతరం జూన్ 22న బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్​తో తలపడుతుంది. ఈ స్టేజ్​లో చివరగా జూన్ 24వ తేదీన ఫేవరెట్స్​లో ఒకటైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్​లన్నీ కరీబియన్ దీవుల్లోనే జరగనున్నాయి.

బార్బడోస్, ఆంటిగ్వా, సెయింట్ లూసియాలు భారత్ ఆడే సూపర్-8 మ్యాచ్​లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గ్రూప్ దశలో చెలరేగి ఆడిన రోహిత్ సేన.. అదే ఊపును ఇక మీదట కూడా కొనసాగిస్తే ఈజీగా నాకౌట్​ స్టేజ్​కు చేరుకుంటుంది. అయితే వెస్టిండీస్ పిచ్​లపై నెక్స్ట్ లెవల్​ గేమ్​తో అలరిస్తున్న ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్​ను ఓడించడం అంత ఈజీ కాదు. అందునా బిగ్ మ్యాచెస్​లో ఎలా ఆడాలనే కిటుకు తెలిసిన కంగారూలను మట్టికరిపించడం అంటే భారత్​కు తలకు మించిన పనే. అయితే వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకునేందుకు మెన్ ఇన్ బ్లూకు ఇదే కరెక్ట్ టైమ్. స్లో పిచ్​లపై స్పిన్ అస్త్రాన్ని బయటకు తీస్తే ఆసీస్​ను దెబ్బకొట్టొచ్చు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘాన్​తో పాటు ఒకవేళ బంగ్లాదేశ్ గనుక సూపర్-8కు చేరుకుందా.. టీమిండియాకు మరింత కఠిన సవాల్ ఎదురవుతుంది. ఏమాత్రం లైట్ తీసుకున్నా బంగ్లా, ఆఫ్ఘాన్​ టీమ్స్ చెలరేగుతాయి. కాబట్టి మూడు మ్యాచుల్ని డూ ఆర్ డైగా ఆడటం ఒక్కటే రోహిత్ సేన ముందున్న ఆప్షన్ అని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.