iDreamPost
android-app
ios-app

ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నా.. ఫ్యాన్స్​కు ఇది పండగ: రోహిత్ శర్మ

  • Published May 31, 2024 | 3:44 PM Updated Updated May 31, 2024 | 3:44 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్​లో మరో అతిపెద్ద సవాల్​కు సిద్ధమవుతున్నాడు. ఈసారి బ్యాటింగ్​తో పాటు కెప్టెన్సీలోనూ అతడు సత్తా చాటాలి. హిట్​మ్యాన్ మీద భారత ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్​లో మరో అతిపెద్ద సవాల్​కు సిద్ధమవుతున్నాడు. ఈసారి బ్యాటింగ్​తో పాటు కెప్టెన్సీలోనూ అతడు సత్తా చాటాలి. హిట్​మ్యాన్ మీద భారత ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

  • Published May 31, 2024 | 3:44 PMUpdated May 31, 2024 | 3:44 PM
ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నా.. ఫ్యాన్స్​కు ఇది పండగ: రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్​లో మరో అతిపెద్ద సవాల్​కు సిద్ధమవుతున్నాడు. ఈసారి బ్యాటింగ్​తో పాటు కెప్టెన్సీలోనూ అతడు సత్తా చాటాలి. హిట్​మ్యాన్ మీద భారత ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దంన్నరకు పైగా కెరీర్​లో ఎన్నో ఆటుపోట్లు చూశాడు హిట్​మ్యాన్. ఒంటిచేత్తో జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు. విధ్వంసక బ్యాటింగ్​తో ప్రత్యర్థులను ఎన్నోమార్లు చీల్చి చెండాడాడు. అయితే ఇప్పుడు రియల్​ ఛాలెంజ్ ఎదుర్కొంటున్నాడు. టీ20 వరల్డ్ కప్-2007 నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్.. ఇప్పుడు టీమ్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. కెరీర్ ఆఖర్లో మరోమారు ప్రపంచ కప్​ను ఒడిసిపట్టాలని చూస్తున్నాడు. గతేడాది తృటిలో వన్డే వరల్డ్ కప్ మిస్సైంది. దీంతో యూఎస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్-2024ను అయినా సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.

మెగా టోర్నీలో ఆడేందుకు అమెరికాకు చేరుకున్న రోహిత్ జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సహచర ఆటగాళ్లతో కలసి సాధనలో మునిగిపోయాడు. అతడి కసి చూస్తుంటే ఈసారి వరల్డ్ కప్ కొట్టే దాకా వదిలేలా కనిపించడం లేదు. అభిమానులు కూడా హిట్​మ్యాన్​పై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ కప్ ట్రోఫీతో ఫొటో దిగాడు రోహిత్. ఈ సందర్భంగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న న్యూయార్క్ స్టేడియం గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ స్టేడియం అద్భుతంగా ఉందన్నాడు. ఇది ఓపెన్ గ్రౌండ్ అని.. ఇక్కడే ఫస్ట్ వార్మప్ గేమ్ ఆడనున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్​ కోసం టీమిండియా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని రోహిత్ చెప్పాడు. ఇది వాళ్లకు పండుగ లాంటిదన్నాడు.

‘న్యూయార్క్ స్టేడియం అద్భుతంగా ఉంది. ఇది ఓపెన్ గ్రౌండ్. ఇక్కడే మేం మా తొలి వార్మమ్ మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్ కోసం ఇక్కడి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మేం కూడా ఆ క్షణాల కోసం వెయిట్ చేస్తున్నాం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్​ బరిలోకి దిగే క్షణాల కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. ఇక్కడి ఫ్యాన్స్​కు మెగా టోర్నీ పండుగ లాంటిదన్నాడు. ఇక, భారత్-బంగ్లాదేశ్ మధ్య జూన్ 1వ తేదీన వార్మప్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్​లో తమ తొలి మ్యాచ్​లో జూన్ 9వ తేదీన దాయాది పాకిస్థాన్​తో తలపడనుంది టీమిండియా. ఆ మ్యాచ్​తో పాటు భారత్ ఆడే మరికొన్ని మ్యాచ్​లు న్యూయార్క్​ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలోనే జరగున్నాయి. అందుకే ఆ గ్రౌండ్ గురించి స్పెషల్​గా మెన్షన్​ చేశాడు హిట్​మ్యాన్. మరి.. వరల్డ్ కప్ ఆరంభం కోసం మీరెంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.