Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో ఓటమితో సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అతడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో ఓటమితో సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అతడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
Nidhan
సౌతాఫ్రికా జట్టు హార్ట్ బ్రేక్ అయింది. టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీ చేతుల దాకా వచ్చి మిస్సవడంతో ఆ టీమ్ నిరాశలో కూరుకుపోయింది. సీజన్ మొత్తం అద్భుతమైన ఆటతీరుతో అలరించారు ప్రొటీస్ ఆటగాళ్లు. ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ఫైనల్‌కు వచ్చిన సఫారీలు.. తుదిపోరులో భారత్ జోరు ముందు తలొంచక తప్పలేదు. రోహిత్ సేనను కూడా ఓడిస్తామని అనుకున్నారు. అందుకు తగ్గట్లే మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఆ టీమ్ ప్లేయర్లు సూపర్బ్‌గా ఆడారు. ఓ దశలో సౌతాఫ్రికాదే విజయమని అంతా అనుకున్నారు. క్లాసెన్-మిల్లర్ క్రీజులో ఉండటం, 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉండటంతో కప్పు మార్క్రమ్ సేనదేనని చాలా మంది భావించారు. బంతికో పరుగు చొప్పున చేసినా గెలిచే అవకాశం ఉండటంతో ఇక టైటిల్ చేజారిందని భారత అభిమానులు టెన్షన్ పడ్డారు.
కీలక టైమ్‌లో క్లాసెన్ ఔట్ అవడం, స్వల్ప వ్యవధిలో మిల్లర్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో సౌతాఫ్రికా కప్పుకు ఆమడ దూరంలో ఆగిపోయింది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్‌తో ప్రొటీస్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. క్లాసెన్ ఔట్ అయినా ఆఖరి వరకు మిల్లర్ ఉండటంతో సౌతాఫ్రికా ఫ్యాన్స్ గెలుపుపై ఆశలు పెంచుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఫెంటాస్టిక్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కప్పు మిస్సవడంతో మిల్లర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎంత కష్టపడినా టైటిల్ దక్కలేదని అతడు బోరున విలపించాడు. ఇక, కప్పు కోల్పోయిన బాధలో ఉన్న మిల్లర్ రిటైర్మెంట్ ప్రకటించాడంటూ వార్తలు వచ్చాయి. వరల్డ్ కప్ ఓటమితో అతడు కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడంటూ రూమర్స్ వచ్చాయి. దీనిపై అతడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు మిల్లర్. తాను టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పానంటూ వస్తున్న రిపోర్ట్స్‌లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. ‘నేను రిటైర్ అయ్యానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ నుంచి నేను వైదొలగలేదు. సౌతాఫ్రికా టీమ్ సెలెక్షన్‌కు నేను అందుబాటులో ఉంటా. నా నుంచి ఇంకా బెస్ట్ రావాల్సి ఉంది’ అని మిల్లర్ క్లారిటీ ఇచ్చాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదంటూ స్వయంగా సౌతాఫ్రికా స్టార్ స్పష్టత ఇవ్వడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మిల్లర్‌లో ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని, ప్రొటీస్ టీమ్‌కు అతడి అవసరం ఉందని చెబుతున్నారు. సఫారీ క్రికెట్‌కు అతడి ఎక్స్‌పీరియెన్స్ అవసరమని కామెంట్స్ చేస్తున్నారు.
David Miller confirms he hasn’t retired from T20I Cricket.
– The reports on Social media are fake. pic.twitter.com/YXTqmHMtF8
— Johns. (@CricCrazyJohns) July 2, 2024