Nidhan
Team India: భారత జట్టుకు రెండుమార్లు కోచ్‌గా వ్యవహరించిన ఓ దిగ్గజం ఇప్పుడు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బీసీసీఐ సాయం కోసం వెయిట్ చేస్తున్నాడు.
Team India: భారత జట్టుకు రెండుమార్లు కోచ్‌గా వ్యవహరించిన ఓ దిగ్గజం ఇప్పుడు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బీసీసీఐ సాయం కోసం వెయిట్ చేస్తున్నాడు.
Nidhan
నేషనల్ టీమ్‌కు ఆడాలనేది చాలా మంది క్రికెటర్ల కల. తీవ్ర పోటీని దాటుకొని అక్కడి వరకు వెళ్లడం అనేది కోట్ల మందిలో ఏ ఒకరిద్దరికో మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటిది టీమిండియాకు ఆడటం, ఆ తర్వాత కోచింగ్ కూడా చేయడం అంటే మాటలు కాదు. ఒకటి కాదు.. ఏకంగా రెండు సార్లు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం అంటే ఆ ఆటగాడి విశిష్టత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మరెవరో కాదు.. అన్షుమన్ గైక్వాడ్. టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేసిన ఈ లెజెండ్.. ఇప్పుడు లండన్‌లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నాడు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థిక సాయం చేయాలని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ భారత క్రికెట్ బోర్డును కోరాడు. బీసీసీఐ నుంచి తనకు సాయం అందిందని, అయితే ట్రీట్మెంట్ కోసం మరింత డబ్బు కావాలని గైక్వాడ్ తనతో చెప్పాడని పాటిల్ తెలిపాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్‌తో పాటు బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్‌తో డిస్కస్ చేశామన్నాడు. ఇతర మాజీ ఆటగాళ్లు కూడా గైక్వాడ్‌కు ఆర్థిక సాయం చేయాల్సిందిగా బోర్డుకు రిక్వెస్ట్ చేయడంతో బీసీసీఐ రెస్పాన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా, 1974 నుంచి 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు అన్షుమన్. 1997 నుంచి 1999 మధ్య కాలంలో ఒకసారి, అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000 టైమ్‌లో మరోసారి భారత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.
అన్షుమన్ గైక్వాడ్ కోచ్‌గా ఉన్న టైమ్‌లో భారత జట్టు పలు అద్భుత విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. ఆయన హయాంలో సచిన్ టెండూల్కర్ తన బెస్ట్ ఫామ్‌ను చూపించాడు. మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ టెక్నిన్‌ను మరింత మెరుగుపరిచి అతడ్ని గొప్ప బ్యాటర్‌గా సానబెట్టాడు గైక్వాడ్. ఆ తర్వాత సచిన్ వెనుదిరిగి చూసుకోలేదు. అలాంటోడు ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో అభిమానులు బాధపడుతున్నారు. ఆయనకు సాయం చేయాలని బోర్డును కోరుతున్నారు. ఇక, ఇంటర్నేషనల్ క్రికెట్లో కంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో గైక్వాడ్‌కు గొప్ప రికార్డు ఉంది. ఆయన 206 దేశవాళీ మ్యాచుల్లో ఏకంగా 12,136 పరుగులు చేశాడు. అలాగే 143 వికెట్లు కూడా పడగొట్టాడు.