టీ20 వరల్డ్ కప్ టీమ్​లోకి అతడ్ని తీసుకోకుండా పెద్ద తప్పు చేశారు: రవిశాస్త్రి

భారత టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్​లోకి ఆ ప్లేయర్​ను తీసుకోకుండా పెద్ద తప్పు చేశారన్నాడు.

భారత టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమ్​లోకి ఆ ప్లేయర్​ను తీసుకోకుండా పెద్ద తప్పు చేశారన్నాడు.

టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​ను భారత క్రికెట్ బోర్డు రీసెంట్​గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ లీడ్ చేయనున్న ఈ టీమ్​కు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఓపెనింగ్ స్లాట్ నుంచి ఫినిషర్ వరకు, స్పిన్నర్ల నుంచి పేసర్ల వరకు ప్రతి విభాగం బలంగా ఉండేలా చూసుకున్నారు సెలెక్టర్లు. 15 మందితో కూడిన స్ట్రాంగ్ స్క్వాడ్​ను అనౌన్స్ చేశారు. అలాగే కొందరు ఆటగాళ్లను రిజర్వ్​డ్​గా కూడా ఎంపిక చేశారు. ఒక్కో పొజిషన్ కోసం మల్టిపుల్ ప్లేయర్లు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా టీమిండియాలో రెగ్యులర్​గా ఉన్న కొంతమందిని వరల్డ్ కప్ స్క్వాడ్​లోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు.

టీ20లు, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు శుబ్​మన్ గిల్. ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఫార్మాట్​కు తగ్గట్లు తన బ్యాటింగ్ శైలిని మార్చుకుంటూ పరుగుల వరద పారించాడు. ఐపీఎల్-2024లోనూ తన బ్యాట్​ ప్రతాపం ఏంటో చూపిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచుల్లో కలిపి 426 పరుగుల చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​లో సెంచరీ కూడా బాదాడు. అలాంటోడ్ని సెలెక్టర్లు మెయిన్ టీమ్​లోకి తీసుకోలేదు. రిజర్వ్​డ్ ప్లేయర్​గా ప్రపంచ కప్​కు వెళ్లనున్నాడు గిల్. ఈ విషయంపై రవిశాస్త్రి స్పందించాడు. శుబ్​మన్​ను ప్రధాన జట్టులోకి తీసుకోకుండా పెద్ద తప్పు చేశారని అన్నాడు.

‘ఎంతో సామర్థ్యం, టాలెంట్ ఉన్న శుబ్​మన్ గిల్​ లాంటి ప్లేయర్​ను వరల్డ్ కప్ టీమ్​లోకి తీసుకోవాలి. ఏ దేశంలోనైనా సరే ఇలాంటి క్యాలిబర్ ఉన్న ఆటగాడ్ని తప్పకుండా జట్టులోకి తీసుకుంటారు. కానీ అతడికి వరల్డ్ కప్ స్క్వాడ్​లో చోటు దక్కలేదు. ఇది తప్పకుండా గిల్​ను బాధిస్తుంది. అతడు ఎంతో వేదనను అనుభవిస్తున్నాడు. అయితే దీని నుంచి యంగ్ బ్యాటర్ త్వరగా బయటపడాలి. దీన్ని పాజిటివ్​గా తీసుకొని బ్యాట్​తో తన పని తాను చేసుకుపోవాలి. అతడు ఫ్యూచర్​లో మరింత తోపు బ్యాటర్ అవుతాడు. తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటాడు. వరల్డ్ కప్ టీమ్​లో ప్లేస్ దక్కకపోవచ్చు. కానీ దీని నుంచి అతడు నేర్చుకొని తప్పక భవిష్యత్తులో అద్భుతాలు చేస్తాడు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి.. గిల్​ను తీసుకోకుండా తప్పు చేశారంటూ మాజీ హెడ్‌ కోచ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments