Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దశాబ్దంన్నరగా అద్భుతమైన బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఎన్నో కఠిన మ్యాచుల్లో ఒంటిచేత్తో టీమ్‌ను గట్టెక్కించాడు. అయితే ఆ రోజు మాత్రం టెన్షన్‌తో వణికిపోయాడట.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దశాబ్దంన్నరగా అద్భుతమైన బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఎన్నో కఠిన మ్యాచుల్లో ఒంటిచేత్తో టీమ్‌ను గట్టెక్కించాడు. అయితే ఆ రోజు మాత్రం టెన్షన్‌తో వణికిపోయాడట.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దశాబ్దంన్నరగా అద్భుతమైన బ్యాటింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఎన్నో కఠిన మ్యాచుల్లో ఒంటిచేత్తో టీమ్‌ను గట్కెక్కించాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే చాలు.. అవతలి జట్టు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ, అవసరమైతే ఆఖర్లో గేర్లు మార్చి వేగం పెంచడం కూడా కింగ్‌కు అలవాటు. అందుకే అతడు ఆడుతున్నాడంటే అవతలి జట్టు వణికిపోతుంది. అతడ్ని ఎలా ఆపాలో అర్థం కాక బౌలర్లంతా తలలు పట్టుకుంటారు. అయితే అపోజిషన్ టీమ్స్‌ను భయపెట్టే కోహ్లీ.. ఆ రోజు మాత్రం టెన్షన్‌తో వణికిపోయాడట. ఆందోళనతో ఏం చేయాలో పాలుపోలేదట. అసలు.. కోహ్లీ అంతగా టెన్షన్ పడటానికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కోహ్లీ కెరీర్ స్టార్టింగ్ డేస్ అవి. అప్పుడప్పుడే టీమ్‌లో సెటిల్ అవుతున్నాడు. అంతలోనే వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. అప్పటికే తాను ఏంటో ప్రూవ్ చేసుకోవడంతో విరాట్‌కు టీమ్‌లో చోటు దక్కింది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, సురేష్ రైనా లాంటి లెజెండ్స్‌తో కలసి డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకుంటున్నాడు. ఒకవైపు ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతుండటం, మరోవైపు దిగ్గజ ప్లేయర్లతో కలసి ఆడుతుండటంతో ఆందోళనకు లోనయ్యాడు కోహ్లీ. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోలేదని, తీవ్రంగా ఆందోళన చెందానని చెప్పాడు విరాట్. అలా మళ్లీ ఎప్పుడూ జరగలేదన్నాడు.
‘వన్డే ప్రపంచ కప్-2011లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడా. ఆ టైమ్‌లో చాలా టెన్షన్ పడ్డా. ఇది నిజం. బైలాటరల్ సిరీస్‌ల్లో ఆడటం వేరు. మెగా టోర్నీల్లో టీమ్ తరఫున బరిలోకి దిగడం వేరు. అప్పుడు టీమ్‌లో అందరికంటే నేనే చిన్నవాడ్ని. సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ ప్లేయర్లతో కలసి ఆడే ఛాన్స్ రావడం అద్భుతం. అయితే మ్యాచ్‌కు ముందు రోజు వరకు కూడా నేను ఆందోళనగానే ఉన్నా. ఇలా ఉండటంలో తప్పేం లేదు. వీటిని మంచి శకునాలుగానే చూడాలి. టెన్షన్లో ఉన్నప్పుడే మన బెస్ట్ గేమ్‌ను బయటకు తీసుకురాగలం. దాని కోసం మెంటల్‌గా, ఫిజికల్‌గా ప్రిపేర్ అయ్యా. నా ప్లాన్స్‌ను ఎగ్జిక్యూట్ చేసేందుకు ఆ నెర్వస్నెస్ ఎంతో ఉపయోగపడింది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక, విరాట్ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో ఏకంగా 741 పరుగులు చేశాడు. అతడు ఇదే ఫామ్‌ను టీ20 వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. మరి.. మెగా టోర్నీలో కోహ్లీ బ్యాట్‌తో మ్యాజిక్ చేయగలడని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.