Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్ ఫామ్‌తో బాధపడుతున్నాడు. పొట్టి కప్పులో ప్రత్యర్థులను ఇరగదీస్తాడనుకుంటే వరుస వైఫల్యాలతో సొంత జట్టును భయపెడుతున్నాడు. ఈ తరుణంలో అతడికి కీలక సూచన చేశాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్ ఫామ్‌తో బాధపడుతున్నాడు. పొట్టి కప్పులో ప్రత్యర్థులను ఇరగదీస్తాడనుకుంటే వరుస వైఫల్యాలతో సొంత జట్టును భయపెడుతున్నాడు. ఈ తరుణంలో అతడికి కీలక సూచన చేశాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.
Nidhan
విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్లో బెస్ట్ బ్యాటర్. అతడ్ని చూస్తేనే ప్రత్యర్థి జట్లు షేక్ అవుతాయి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు.. అతడితో మాత్రం వద్దంటూ భయంతో వెనకడుగు వేస్తాయి. విరాట్‌ను గెలికితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియా సహా టాప్ టీమ్స్ అన్నింటికీ తెలుసు. అందుకే ద్వైపాక్షిక టోర్నమెంట్లలోనే కాదు.. బడా టోర్నీల్లోనూ కోహ్లీ జోలికి ఎవరూ వెళ్లరు. ఐసీసీ టోర్నీల్లో రెచ్చిపోయి ఆడుతుంటాడు కింగ్. ఎన్నోసార్లు ఇది చేసి చూపించాడు. అలాంటోడు ఈసారి మాత్రం చతికిలపడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్-2024లో ఇప్పటిదాకా ఆడిన 3 మ్యాచుల్లో కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు కింగ్. దీంతో సూపర్-8కు ముందు భారత జట్టులో భయం మొదలైంది. టీమ్‌కు వెన్నెముక లాంటి కింగ్ ఇలా ఆడితే ఎలా అని మేనేజ్మెంట్ టెన్షన్ పడుతోంది.
సూపర్-8, నాకౌట్ లాంటి బిగ్ స్టేజెస్‌లో కోహ్లీ బాగా ఆడటం ముఖ్యం. బడా జట్ల మీద విరాట్ నిలబడితే టీమ్‌కు తిరుగుండదు. అందునా స్లో పిచ్‌లపై కింగ్ త్వరగా పెవిలియన్‌కు చేరితే మిగిలిన ఆటగాళ్ల మనోస్థైర్యం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో విరాట్ ఫామ్ గురించి టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఇంట్రెస్టింగ్ కైఫ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ ఊపందుకోవడం చాలా ముఖ్యమని చెప్పాడు. అయితే తిరిగి ఫామ్‌ను అందుకోవాలంటే అతడో పని చేయాల్సి ఉందన్నాడు. అదే బ్యాటింగ్ మార్పు అని తెలిపాడు కైఫ్. ఓపెనింగ్‌లో కాకుండా మూడో పొజిషన్లో బ్యాటింగ్‌కు దిగాలని.. అప్పుడే కోహ్లీ తనదైన శైలిలో ఆడగలడని పేర్కొన్నాడు. సీమ్ బౌలింగ్‌కు అనుకూలించే యూఎస్ఏ-వెస్టిండీస్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదన్నాడు.
‘కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలి. సీమ్ బౌలింగ్‌కు అనుకూలించే ఈ కండీషన్స్‌లో పరుగులు రాబట్టడం అంత సులువు కాదు. ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్‌లు ఉంటాయి. కాబట్టి అక్కడ ఓపెనింగ్‌లో దిగి పరుగుల వర్షం కురిపించొచ్చు. కానీ యూఎస్ఏ-కరీబియన్ పిచ్‌లపై అది సాధ్యం కాదు. మెగా టోర్నీలో అతడు అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇలాంటి శైలి అక్కడ పని చేయదు. అడ్డగోలు షాట్లు ఆడే బదులు తన వికెట్‌ను కాపాడుకోవడంపై కోహ్లీ ఫోకస్ చేయాలి. వికెట్‌ను కాపాడుకుంటూ ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేయాలి. ఆ తర్వాత పరుగులు అవే వస్తాయి’ అని కైఫ్ సూచించాడు. కైఫ్ అనే కాదు.. మరికొందరు మాజీలు కూడా ఇదే సలహా ఇస్తున్నారు. విరాట్ థర్డ్ డౌన్లో దిగాలని అంటున్నారు. దూకుడును పక్కనబెట్టి ఇన్నింగ్స్‌ను నిర్మించడం మీద దృష్టి పెట్టాలని చెబుతున్నారు. మరి.. కోహ్లీ ఓపెనింగ్ నుంచి మూడో పొజిషన్‌కు మారాలనే సలహాపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Mohammad Kaif ” Virat Kohli should bat at number three.He has been opening in these seaming conditions where batting is not easy,unlike the flat pitches in the IPL but perhaps here, he shouldn’t play aggressively,maybe he should play to save his wicket.”pic.twitter.com/QyGd7x6bfV
— Sujeet Suman (@sujeetsuman1991) June 13, 2024