Nidhan
టీ20 వరల్డ్ కప్-2024కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా బిగ్ రిస్క్ చేస్తోంది. ప్రపంచ కప్ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్న అగ్రరాజ్యం క్రికెట్ హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా అనూహ్య ప్రయత్నం చేస్తోంది. దీని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోకమానరు.
టీ20 వరల్డ్ కప్-2024కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా బిగ్ రిస్క్ చేస్తోంది. ప్రపంచ కప్ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్న అగ్రరాజ్యం క్రికెట్ హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా అనూహ్య ప్రయత్నం చేస్తోంది. దీని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోకమానరు.
Nidhan
ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్-2024 మొదలవనుంది. జూన్ 2వ తేదీ నుంచి మెగా టోర్నీ సందడి షురూ కానుంది. ఈసారి వరల్డ్ కప్‌కు అగ్రరాజ్యం అమెరికాతో కలసి వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది. అయితే క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణలో ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న విండీస్ క్రికెట్ బోర్డు వరల్డ్ కప్ ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే క్రికెట్ కల్చర్‌ను అలవాటు చేసుకుంటున్న యూఎస్ ఈ విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఫుట్‌బాల్, బేస్‌బాల్ లాంటి స్పోర్ట్స్‌కు ప్రసిద్ధిగా ఉన్న అమెరికాకు వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ బిగ్ ఛాలెంజ్‌గా మారింది. ఈ టోర్నీ కోసం ఆ దేశం చేస్తున్న రిస్క్ గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే.
అమెరికాలో ప్రొఫెషనల్ క్రికెట్ స్టేడియాలు లేవు. వరల్డ్ కప్ మొదలవడానికి ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు. దీంతో కొన్ని ఫుట్‌బాల్ స్టేడియాలను క్రికెట్ మైదానాలుగా మారుస్తోంది యూఎస్. అదే టైమ్‌లో వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా కొన్ని క్రికెట్ స్టేడియాలను కూడా నిర్మిస్తోంది. అయితే స్టేడియాల నిర్మాణం విషయంలో ఇబ్బంది లేకున్నా పిచ్‌ల తయారీ ఆ టీమ్‌కు పెద్ద సవాలుగా మారింది. క్రికెట్లో గ్రౌండ్ల కన్నా కూడా పిచ్ చాలా ముఖ్యం. దీంతో ఇందులో అనుభవం లేని అగ్రరాజ్యం భారీ సాహసానికి పూనుకుంది. పిచ్‌లు తయారు చేయడంలో ఆరితేరిన ఆస్ట్రేలియా సాయం తీసుకుంటోంది. ఆ దేశంలోని అడిలైడ్ నుంచి రెడీమేడ్ పిచ్‌లను తెప్పిస్తోంది.
వరల్డ్ కప్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం ఇస్తున్నా టోర్నీలోని పిచ్‌లను మాత్రం ఆస్ట్రేలియా సిద్ధం చేస్తోంది. అడిలైడ్‌లో రూపొందించిన పిచ్‌లను సముద్ర మార్గం ద్వారా నౌకల్లో యూఎస్‌కు రప్పిస్తున్నారు. దాదాపుగా 14 వేల కిలోమీటర్లు ప్రయాణించి పిచ్‌లు అగ్రరాజ్యానికి చేరుతున్నాయి. మొదట ఫ్లోరిడాకు ఆ తర్వాత న్యూయార్క్‌కు వాటిని తరలించారని తెలుస్తోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయిన పిచ్‌లను వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న స్టేడియాల్లో ప్లాంట్ చేయడానికి 12 గంటలకు పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ యూఎస్ సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రపంచ కప్ కోసం ఆ టీమ్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు. ఇంత దూరం నుంచి పిచ్‌లు తెప్పించడం మామూలు విషయం కాదని.. వరల్డ్ క్రికెట్లో ఎవరూ ఇలాంటి రిస్క్ చేయలేరేమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇదే రీతిలో మరింత వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. మరి.. అమెరికా పిచ్‌లను ఆస్ట్రేలియా నుంచి తెప్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
2024 T20 World Cup USA matches will have drop-in pitches transported all the way from Australia:
– Transported from Adelaide.
– Travelled 14,000km by ship to US.
– Reached Florida, then to New York.
– Took 12 hours to plant pitches at venues. pic.twitter.com/8evAlnX4LI— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024