iDreamPost
android-app
ios-app

Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా రోహిత్ అవసరం లేదు.. క్రికెట్ అనలిస్ట్ షాకింగ్ కామెంట్స్!

  • Published Apr 25, 2024 | 10:11 AM Updated Updated Apr 25, 2024 | 10:11 AM

ప్రముఖ సీనియర్ క్రికెట్ అనలిస్ట్ జోయ్ భట్టాచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ అవసరం లేదని బాంబ్ పేల్చాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రముఖ సీనియర్ క్రికెట్ అనలిస్ట్ జోయ్ భట్టాచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ అవసరం లేదని బాంబ్ పేల్చాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా రోహిత్ అవసరం లేదు.. క్రికెట్ అనలిస్ట్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఇక ఈ మెగా టోర్నీ తర్వాత వెంటనే మరో టోర్నీ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. అదే టీ20 వరల్డ్ కప్ 2024. జూన్ 1 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ఈ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే ఆటగాళ్లు, జట్లు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ క్రికెట్ అనలిస్ట్ జోయ్ భట్టాచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ అవసరం లేదని బాంబ్ పేల్చాడు. ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ 2024.. ప్రస్తుతం టీమిండియా ముందున్న టార్గెట్. మరోసారి ఈ పొట్టి వరల్డ్ కప్ ను ముద్దాడాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మెగాటోర్నీలో భారత టీమ్ ను ముందుండి నడిపించబోతున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా వెల్లడించింది. అయితే ప్రముఖ సీనియర్ క్రికెట్ అనలిస్ట్ జోయ్ భట్టాచార్య షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అతడు మాట్లాడుతూ..”టీ20 వరల్డ్ కప్ కి భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ అవసరం లేదు. రోహిత్ అద్భుతమైన క్రికెటరే. కానీ ప్రస్తుతం అతడు ఫామ్ లో లేడు. అతడి కంటే జైస్వాల్, విరాట్ కోహ్లీ లాంటి వారు బాగా ఆడుతున్నారు. ఇక అతడిని సారథిగా ప్రకటించడం మూలంగా టీమ్ లో ఒక ప్లేస్ ఆల్రెడీ ఫిల్ అయినట్లే. నేనైతే జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ చేసేవాడిని” అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ పాస్ చేశాడు.

అయితే.. భట్టాచార్య కామెంట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐపీఎల్ లో సీజన్ లో హిట్ మ్యాన్ ఓ సెంచరీ సాధించాడు, మరిచిపోయారా? ఇక కెప్టెన్ గా రోహిత్ అనుభవాన్ని నవ్వు మర్చిపోయావా? తన అపార అనుభవాన్ని ఉపయోగించి టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించగల సత్తా హిట్ మ్యాన్ కు ఉంది. ఇంత సీనియర్ ఎనలిస్ట్ అయిన మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ అతడిపై ఫైర్ అవుతున్నారు. మరి టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా రోహిత్ అవసరం లేదన్న సీనియర్ క్రికెట్ అనలిస్ట్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.