Nidhan
టీ20 వరల్డ్ కప్ మధ్యలో నుంచే ఇంటికి పయనమయ్యాడు టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్. అతడ్ని స్వదేశానికి పంపడానికి ఇవే కారణాలంటూ పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్ మధ్యలో నుంచే ఇంటికి పయనమయ్యాడు టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్. అతడ్ని స్వదేశానికి పంపడానికి ఇవే కారణాలంటూ పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో సూపర్-8కు చేరుకుంది టీమిండియా. నిన్న కెనడాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. అయినా ఆ మ్యాచ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా సూపర్-8 బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది భారత్. గ్రూప్ దశలో ఆడినట్లే నెక్స్ట్ స్టేజ్‌లోనూ ఇరగదీయాలని రోహిత్ సేన భావిస్తోంది. ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియాను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లాలని చూస్తోంది. అందుకు కావాల్సిన ప్రణాళికల్ని రచిస్తోంది. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలసి వ్యూహాలను పన్నడంలో కెప్టెన్ రోహిత్ బిజీ అయిపోయాడు. అయితే భారత క్రికెట్‌కు సంబంధించి ఇప్పుడు ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను పొట్టి కప్పు మధ్యలోనే స్వదేశానికి పంపించింది టీమ్ మేనేజ్మెంట్. ఉన్నపళంగా అతడ్ని ఎందుకు వెనక్కి పంపారనేది చిక్కు ప్రశ్నగా మారింది.
ట్రావెలింగ్ రిజర్వ్డ్గా ఉన్న గిల్‌ను స్వదేశానికి పంపడానికి అతడి తప్పే కారణమనే రూమర్స్ వస్తున్నాయి. యూఎస్ఏ గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి భారత జట్టుతో జర్నీ చేయకుండా.. తన సొంత వ్యాపారాలపై గిల్ ఫోకస్ చేస్తున్నాడని వినిపిస్తోంది. టీమ్‌తో ఉంటూ ప్రాక్టీస్ చేస్తూ, మ్యాచ్‌ల సమయంలో ఎంకరేజ్ చేయాల్సింది పోయి.. తనకు ఏదీ పట్టనట్టుగా ఉంటున్నాడని సమాచారం. అందుకే గతంలో సౌతాఫ్రికా టూర్ నుంచి ఇషాన్ కిషన్‌ను తప్పించిన మాదిరిగా.. ఇప్పుడు గిల్‌ను ఇంటికి పంపారనే పుకార్లు మొదలయ్యాయి. దీంతో ఇషాన్‌లాగే శుబ్‌మన్ కూడా జట్టుకు దూరమైపోతాడేమోనని అతడి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీ మీద భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ రియాక్ట్ అయ్యాడు. గిల్‌ను వెనక్కి పంపడానికి అసలు రీజన్ ఏంటో అతడు వివరించాడు.
‘మెగా టోర్నీ స్టార్ట్ అవడానికి ముందే వేసుకున్న ప్రణాళిక ఇది. యూఎస్ఏకు వచ్చే టైమ్‌కు నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు ఉండాలని అనుకున్నాం. అనంతరం వెస్టిండీస్‌కు వెళ్లేటప్పుడు ఇద్దరు ఆటగాళ్లను రిలీజ్ చేయాలని ముందే అనుకున్నాం. టీమ్ సెలెక్షన్ సమయంలోనే వేసుకున్న ప్లాన్ ఇది. దాన్నే తాజాగా అమలు చేశాం. అమెరికాలోని పిచ్‌లు కొత్తవి. అక్కడ ఆడేటప్పుడు క్రికెటర్లకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను సిద్ధం చేశాం. ఇప్పుడు టీమిండియా సూపర్-8కు చేరుకుంది. ఇక మీదట మ్యాచ్‌లు కరీబియన్ మైదానాల్లో జరుగుతాయి. అందుకే గిల్, అవేశ్ ఖాన్‌ను స్వదేశానికి పంపించాం’ విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రోహిత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో గిల్ అన్‌ఫాలో చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే హిట్‌మ్యాన్‌తో ఉన్న ఓ పిక్‌ను పోస్ట్ చేసి తమ మధ్య ఎలాంటి ఫైట్ జరగలేదని గిల్ క్లారిటీ ఇచ్చాడు.