iDreamPost
android-app
ios-app

IND vs PAK మ్యాచ్ లో రోహిత్ చేసిన.. ఈ ఫన్నీ సీన్ గమనించారా? చూస్తే నవ్వాగదు..

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అతడు చేసిన పనికి బాబర్ అజామ్ నవ్వాపుకోలేకపోయాడు. ఇంతకీ హిట్ మ్యాన్ ఏం చేశాడంటే?

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అతడు చేసిన పనికి బాబర్ అజామ్ నవ్వాపుకోలేకపోయాడు. ఇంతకీ హిట్ మ్యాన్ ఏం చేశాడంటే?

IND vs PAK మ్యాచ్ లో రోహిత్ చేసిన.. ఈ ఫన్నీ సీన్ గమనించారా? చూస్తే నవ్వాగదు..

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా నిన్న(జూన్ 9, ఆదివారం) పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పనికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పగలబడి నవ్వాడు. మరోసారి తన మతిమరుపుతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను నవ్వించాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతకీ రోహిత్ చేసిన పనేంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మతిమరుపును మరోసారి బయటపెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే? పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ వేయడానికి గ్రౌండ్ లోకి వచ్చారు కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. వీరితో పాటుగా రవిశాస్త్రి, మ్యాచ్ రిఫరీ కూడా వచ్చారు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ రోహిత్ ను టాస్ వేయాల్సిందిగా కోరాడు. దాంతో రోహిత్ టాస్ కాయిన్ ఇవ్వండి అంటూ చేయి ముందుకు చాచాడు. కానీ అసలు విషయం ఏంటంటే? టాస్ కాయిన్ హిట్ మ్యాన్ జేబులోనే ఉంది. ఈ విషయం మర్చిపోయిన రోహిత్ కాయిన్ ఎక్కడ? అంటూ ప్రశ్నించడంతో.. బాబర్ తో పాటుగా అక్కడున్న రవిశాస్త్రి, మ్యాచ్ రిఫరీలు పగలబడి నవ్వారు. ఇండియన్ కెప్టెన్ సైతం నవ్వును ఆపుకోలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు రోహిత్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే రోహిత్ టాస్ వేసే క్రమంలో పలు విషయాలు మర్చిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ మ్యాచ్ లో సైతం టాస్ వేసే క్రమంలో టీమిండియా స్వ్కాడ్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అని అడిగితే.. మర్చిపోయాను అని సమాధానం చెప్పి అందర్ని నవ్వించాడు. ఇప్పుడు  ఏకంగా టాస్ కాయిన్ న్నే మర్చిపోయి మరోసారి తన మతిమరుపుతో నవ్వులు పూయించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. మరి భారత కెప్టెన్ రోహిత్ శర్మ మతిమరుపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి