iDreamPost

బంగ్లాతో మ్యాచ్.. జట్టులోకి విధ్వంసకర ప్లేయర్! ఆ ఆటగాళ్లపై వేటు?

బంగ్లాదేశ్ తో జరిగే కీలక మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ కోసం జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ ఇద్దరి ఆటగాళ్లపై వేటు వేసి.. విధ్వంసకర ప్లేయర్ ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ తో జరిగే కీలక మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ కోసం జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ ఇద్దరి ఆటగాళ్లపై వేటు వేసి.. విధ్వంసకర ప్లేయర్ ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాతో మ్యాచ్.. జట్టులోకి విధ్వంసకర ప్లేయర్! ఆ ఆటగాళ్లపై వేటు?

టీ20 వరల్డ్ కప్ 2024లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్ 8 లో భాగంగా ఆఫ్గాన్ పై గెలిచి.. ఫుల్ స్వింగ్ లో ఉన్న భారత జట్టు, అదే జోరును బంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా చూపించాలని భావిస్తోంది. నేడు(జూన్ 22)న అంటిగ్వా వేదికగా బంగ్లాతో తలపడనుంది భారత్. ఈ పోరులో ఎలాగైనా విజయం సాధించి.. సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచ్ కోసం జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరి ప్లేయర్లపై వేటు వేసి.. జట్టులోకి విధ్వంసకర ఆటగాడిని తీసుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది.

సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్ ను ఢీకొనబోతోంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ కోసం జట్టులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలం అవుతున్న స్టార్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబేలపై వేటు వేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే? అంటిగ్వా పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే ఛాన్స్ లు ఉన్నందున జడేజా ప్లేస్ లో మహ్మద్ సిరాజ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్ మెంట్ ఆలోచిస్తోంది.

ఇక యువ సంచలనం, ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ను ఈ మ్యాచ్ లోకి తీసుకోనున్నట్లు క్రీడా వర్గాల సమాచారం. జైస్వాల్ వస్తే.. రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ లు ఉన్నాయి. కాగా.. మిడిలార్డర్ లో దూబే స్థానంలో సంజూ శాంసన్ కు ఛాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇరు జట్ల రికార్డులు చూసుకుంటే.. ఇప్పటి వరకు ఇరు జట్లు 13 టీ20ల్లో తలపడగా.. టీమిండియా 12 మ్యాచ్ ల్లో గెలిచింది. ఒక్క మ్యాచ్ లో మాత్రమే బంగ్లా గెలిచింది.

బంగ్లాతో మ్యాచ్.. టీమిండియా జట్టు(అంచనా):

రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి