Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనవసర రిస్క్ చేస్తున్నాడని ఓ ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు. ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోతే భారత్‌కు కష్టమేనని చెప్పాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనవసర రిస్క్ చేస్తున్నాడని ఓ ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు. ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోతే భారత్‌కు కష్టమేనని చెప్పాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024కు అంతా సిద్ధమైంది. మరో మూడ్రోజుల్లో ప్రపంచ కప్ సంరంభం మొదలవనుంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ యూఎస్ఏకు చేరుకొని ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడేశాయి. కప్పు వేటలో ఉన్న భారత జట్టు కూడా జోరుగా సాధన చేస్తోంది. వన్డే వరల్డ్ కప్-2023ని కొద్దిలో కోల్పోయిన రోహిత్ సేన.. ఈసారి మాత్రం అస్సలు వదిలేదేలే అంటోంది. అన్ని టీమ్స్‌కు ఝలక్ ఇచ్చి టైటిల్ విన్నర్‌గా నిలవాలని చూస్తోంది. మెగా టోర్నీ కోసం టీమిండియా బలమైన లైనప్‌తో వచ్చింది. అన్ని స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. చాలా ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో వరల్డ్ కప్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ ఎలాంటి స్క్వాడ్‌తో ముందకు వెళ్తాడనేది చూడాలి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా లెజెండ్ మైకేల్ క్లార్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
రోహిత్ అనవసర రిస్క్ చేస్తున్నాడని క్లార్క్ అన్నాడు. కాస్త తారుమారైనా జట్టుకు ఓటములు తప్పవంటూ హెచ్చరించాడు. మెగా టోర్నీకి యూఎస్ఏ-వెస్టిండీస్‌లు ఆతిథ్యం ఇస్తున్నాయి. విండీస్‌లో స్లో పిచ్‌లు ఉంటాయి. దీంతో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లను టీమ్‌లోకి తీసుకుంది భారత్. స్లో పిచ్‌లపై ప్రత్యర్థుల పని పట్టేందుకు ఈ వ్యూహంతో ముందుకు వెళ్లాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు. అయితే యూఎస్‌లో మాత్రం ఆస్ట్రేలియాలో తయారు చేసిన పిచ్‌లను ఓడల ద్వారా తెప్పించారు. దీంతో అక్కడి పిచ్‌లు పేస్, బౌన్స్, స్వింగ్‌కు సహకరిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా స్పిన్ వ్యూహం దెబ్బకొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్లార్క్ పైవిధంగా రియాక్ట్ అయ్యాడు.
‘వరల్డ్ కప్ స్క్వాడ్ విషయంలో టీమిండియా బిగ్ రిస్క్ చేసినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ జట్టు స్పిన్ మీద అతిగా ఆధారపడుతోంది. ప్రపంచ కప్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా స్క్వాడ్ కంటే భారత స్క్వాడ్ చాలా భిన్నంగా ఉంది. కంగారూ టీమ్‌లో పేస్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టు మెగా టోర్నీలో అందరి కంటే ఫేవరెట్‌గా కనిపిస్తోంది’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. స్పిన్ ఉచ్చుతో ప్రత్యర్థులను బెదరగొట్టాలని రోహిత్ చూస్తున్నాడని.. ఇది సక్సెస్ అవుతుందా? కాదా? అనేది కాలమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశాడు. హిట్‌మ్యాన్ చేస్తున్న రిస్క్ సక్సెస్ అయితే భారత్‌కు తిరుగుండదని పేర్కొన్నాడు. మరి.. రోహిత్ రిస్క్ చేస్తున్నాడంటూ క్లార్క్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Michael Clarke ” I think India has taken a risk with a squad they have picked, heavily reliant on spin,very different from Australian Squad.But India is favorite to win the T20 World Cup.”
Now Only time will tell, Rohit Sharma gamble was worth it or not.pic.twitter.com/wIOGzCbOBV
— Sujeet Suman (@sujeetsuman1991) May 30, 2024