Somesekhar
పాకిస్తాన్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక దిగ్గజం రికార్డ్ ను బద్దలు కొడుతూ.. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రెండో ప్లేయర్ గా ఘనత వహించాడు. ఆ వివరాల్లోకి వెళితే..
పాకిస్తాన్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక దిగ్గజం రికార్డ్ ను బద్దలు కొడుతూ.. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రెండో ప్లేయర్ గా ఘనత వహించాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ తో సంబంధం లేకుండా.. రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు హిట్ మ్యాన్. దాంతో టీ20 వరల్డ్ కప్ ముందు రోహిత్ ఫామ్ అందరిని భయపెట్టింది. అయితే ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్ లోనే ఐర్లాండ్ పై అర్దశతకం బాది ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ ఆ తర్వాత పాక్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 13 రన్స్ మాత్రమే చేసి.. పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రీలంక దిగ్గజం రికార్డ్ ను బ్రేక్ చేసి.. చరిత్ర సృష్టించాడు రోహిత్.
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను చిత్తు చేసిన భారత్.. ఆ తర్వాత పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను 6 రన్స్ తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేసి నిరాశపరిచాడు. కానీ 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ క్రేజీ రికార్డును నెలకొల్పాడు. అదేంటంటే? టీ20 ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా ఘనత వహించాడు. ఈ క్రమంలోనే శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే రికార్డ్ ను బ్రేక్ చేశాడు.
టీ20 క్రికెట్ చరిత్రలో జయవర్ధనే 31 ఇన్నింగ్స్ ల్లో 1016 పరుగులు చేయగా.. రోహిత్ 37 ఇన్నింగ్స్ ల్లో 1023 పరుగులు చేసి సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కేవలం 26 ఇన్నింగ్స్ ల్లోనే 1142 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో 965 పరుగులతో క్రిస్ గేల్, 901 రన్స్ తో ఐదవ ప్లేస్ లో డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నారు. ఇక ఓవరాల్ గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ ల తర్వాత మూడో స్థానంలో కొనసాగుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మరి శ్రీలంక దిగ్గజం జయవర్ధనే రికార్డ్ రోహిత్ బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨 Most Runs in T20WC !
1142* – Virat Kohli *
1023* – Rohit Sharma *
1016 – Mahela Jayawardene– Rohit Sharma becomes 2nd leading runs scorer in the T20 World Cup History. 🔥 pic.twitter.com/2GP4nRgmxL
— Kuljot⁴⁵ (@Ro45Kuljot) June 9, 2024