Nidhan
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్ ఫెయిల్యూర్‌తో విమర్శలపాలైన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. పొట్టి ప్రపంచ కప్ వేళ ఊపందుకున్నాడు,
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్ ఫెయిల్యూర్‌తో విమర్శలపాలైన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. పొట్టి ప్రపంచ కప్ వేళ ఊపందుకున్నాడు,
Nidhan
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను నిన్న మొన్నటి వరకు అందరూ సూపర్‌స్టార్‌గా చూశారు. ఇలాంటోడు జట్టులో ఉంటే ఎన్ని వరల్డ్ కప్‌లు అయినా సొంతం చేసుకోవచ్చని ప్రశంసల్లో ముంచెత్తారు. అతడి పవర్ హిట్టింగ్ ముందు ఎవరూ పనికిరారని మెచ్చుకున్నారు. అతడే భారత జట్టు భవిష్యత్తు అంటూ ఆకాశానికెత్తేశారు. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ టీమ్‌కు రావడం, కెప్టెన్సీ చేపట్టి ఐపీఎల్లో ఫెయిలవడంతో అతడికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. క్యాష్ రిచ్ లీగ్‌లో బ్యాటర్‌గా, బౌలర్‌గా అట్టర్ ఫ్లాప్ అవడంతో పాండ్యాపై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. పొట్టి ప్రపంచ కప్‌కు అతడ్ని ఎంపిక చేయొద్దంటూ డిమాండ్లూ వచ్చాయి. అదే టైమ్‌లో భార్య నటాషాతో అతడి వివాహ బంధం విషయంలో పొరపచ్చాలు ఏర్పడ్డాయని వార్తలు రాసాగాయి.
ఒకవైపు విమర్శలు, మరోవైపు ట్రోలింగ్, ఇంకోవైపు భార్య నటాషాకు డివోర్స్ అంటూ అనేక ఊహాగానాలు వ్యాప్తిలోకి రావడంతో హార్దిక్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అయితే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా తన ఆటతీరుతోనే వాటికి సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యాడు. వరల్డ్ కప్ కోసం జోరుగా సాధన చేస్తున్న ఈ ఆల్‌రౌండర్.. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బాల్, బ్యాట్‌తో అదరగొట్టాడు. 23 బంతుల్లోనే 2 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లను అతడు ఊచకోత కోశాడు. బౌలింగ్‌లోనూ 1 వికెట్ తీశాడు. దీంతో విమర్శించినోళ్లే పాండ్యాను మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గెలుపోటములను ఒకేతీరుగా తీసుకుంటానని.. విజయగర్వాన్ని తలకు ఎక్కించుకోనని అన్నాడు. సక్సెస్‌ను సీరియస్‌గా తీసుకోనని.. అప్పుడే వదిలేస్తానని చెప్పాడు.
‘సక్సెస్‌ను పట్టించుకోను. వెంటనే వదిలేస్తా. బాగా ఆడినా ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయి ముందుకు సాగుతా. కష్టసమయాల్లో కూడా అలాగే ఉంటా. ఇలాంటివి సీరియస్‌గా తీసుకునే అలవాటు నాకు లేదు. అలాగని వాటి నుంచి పారిపోను. ఏ సమస్య వచ్చినా నిలబడి పోరాడతా. జీవితమనే ఈ యుద్ధంలో నిరంతరం ఫైట్ చేస్తూ ఉండాలి. నిలబడి పోరాడితే తప్పకుండా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. లైఫ్ మొత్తం బ్యాడ్ డేస్ ఉండవు. మంచి రోజులూ వస్తాయి. క్లిష్టమైన పరిస్థితులను దాటి ముందుకు వెళ్తూ ఉండాలి. సక్సెస్‌ను ఎంజాయ్ చేసి ముందుకు సాగాలి. దాన్ని సీరియస్‌గా తీసుకోను. నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఫోకస్ పెడతా’ అని పాండ్యా స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపాడు. మరి.. తన లైఫ్, కెరీర్ గురించి హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hardik Pandya said “I don’t take my success seriously – whatever I have done well, I have forgotten about them immediately and move forward – same with difficult times, I don’t run away from it. I face everything with my chin up, as they say, this too shall pass”. [Star Sports] pic.twitter.com/rMxKVY7JcL
— Johns. (@CricCrazyJohns) June 2, 2024