iDreamPost
android-app
ios-app

ధోని పరువు తీసిన SRH స్టార్ ప్లేయర్.. అతడికి టెక్నిక్ తెలియదంటూ..!

  • Published Jun 02, 2024 | 2:20 PMUpdated Jun 02, 2024 | 2:20 PM

టీమిండియా లెజెండ్ ధోని పేరు తలచుకోగానే ధనాధన్ బ్యాటింగ్, అద్భుతమైన కెప్టెన్సీనే గుర్తుకొస్తుంది. సారథిగా కంటే ముందు విధ్వంసక బ్యాటింగ్​తో అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బాల్ వేసినా స్టాండ్స్​లోకి తరలించే మాహీ.. ఇప్పుడు కూడా అదే రేంజ్​లో ఆడుతున్నాడు.

టీమిండియా లెజెండ్ ధోని పేరు తలచుకోగానే ధనాధన్ బ్యాటింగ్, అద్భుతమైన కెప్టెన్సీనే గుర్తుకొస్తుంది. సారథిగా కంటే ముందు విధ్వంసక బ్యాటింగ్​తో అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బాల్ వేసినా స్టాండ్స్​లోకి తరలించే మాహీ.. ఇప్పుడు కూడా అదే రేంజ్​లో ఆడుతున్నాడు.

  • Published Jun 02, 2024 | 2:20 PMUpdated Jun 02, 2024 | 2:20 PM
ధోని పరువు తీసిన SRH స్టార్ ప్లేయర్.. అతడికి టెక్నిక్ తెలియదంటూ..!

టీమిండియా లెజెండ్ ధోని అంటే ధనాధన్ బ్యాటింగ్, అద్భుతమైన కెప్టెన్సీనే గుర్తుకొస్తుంది. సారథిగా కంటే ముందు విధ్వంసక బ్యాటింగ్​తో అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బాల్ వేసినా స్టాండ్స్​లోకి తరలించే మాహీ.. ఇప్పుడు కూడా అదే రేంజ్​లో ఆడుతున్నాడు. క్రికెట్​లో ఎంతో డేంజరస్​గా చెప్పే యార్కర్ బంతుల్ని కూడా అలవోకగా హెలికాప్టర్ షాట్ సాయంతో సిక్సులుగా మలుస్తుంటాడతను. బౌలర్ కాస్త లెంగ్త్ తప్పాడా బంతి ఆడియెన్స్​లో పడాల్సిందే అనేలా మాహీ బ్యాటింగ్ సాగుతుంది. ఈసారి ఐపీఎల్​లో ఇదే జరిగింది. గాయం కారణంగా ఎక్కువ డెలివరీస్ ఆడని ధోని.. ఆఖరి ఒకట్రెండు ఓవర్లలో బ్యాటింగ్​కు దిగాడు. చివర్లో వచ్చి బౌండరీలు, సిక్సులతో సీఎస్​కేకు భారీ స్కోర్లు అందించాడు. అలాంటోడ్ని ఓ సన్​రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ తీసిపారేశాడు.

సన్​రైజర్స్ యంగ్ గన్ నితీష్ కుమార్ రెడ్డి ధోని మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. టాలీవుడ్ హీరో కార్తికేయతో కన్వర్జేషన్​లో మాహీ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు నితీష్​. ‘ధోనీకి టాలెంట్ ఉంది. కానీ అతడి బ్యాటింగ్​లో టెక్నిక్ లేదు. విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే మాహీ బ్యాటింగ్​లో ఆ రేంజ్​లో టెక్నిక్ కనిపించదు’ అని నితీష్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నితీష్​ కామెంట్స్​ను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ధోని బ్యాటింగ్ స్టైల్ రఫ్​గా ఉంటుందని, టెక్నిక్ కంటే కూడా భుజ బలం, టైమింగ్​ ఆధారంగా అతడి బ్యాటింగ్ సాగుతుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీతో కంపేర్ చేస్తే ధోని టెక్నికల్​గా అంత స్ట్రాంగ్ కాదని అంటున్నారు.

టెక్నిక్ తెలియందే ధోని ఇన్ని వేల పరుగులు చేశాడా? ఇన్నేళ్లుగా క్రికెట్​లో కంటిన్యూ అవుతున్నాడా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక్క సీజన్​లో బాగా ఆడినంత మాత్రాన లెజెండ్ మాహీ గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ నితీష్​కు చురకలు అంటిస్తున్నారు. ఈ సన్​రైజర్స్ స్టార్ తన బ్యాటింగ్​, బౌలింగ్​ను మెరుగుపర్చుకొని టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం మీద ఫోకస్ చేయాలని.. అనవసర కామెంట్స్​తో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తే కెరీర్​కే ప్రమాదమని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. ఇక, ఐపీఎల్-2024లో ఎస్​ఆర్​హెచ్ తరఫున ఆడుతూ 303 పరుగులు చేశాడు నితీష్​. అలాగే మూడు వికెట్లు కూడా తీశాడు. ఆరెంజ్ ఆర్మీ ఫైనల్ వరకు చేరుకోవడంలో అతడిది కీలక పాత్ర. మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు దిగుతూ విలువైన రన్స్ చేస్తూ టీమ్​కు భారీ స్కోర్లు అందించాడు. మరి.. నితీష్​-ధోని వివాదంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Suril TG (@tg.trends)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి