iDreamPost

Hardik Pandya: చరిత్ర సృష్టించిన పాండ్యా.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు!

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 17 ఏళ్ల క్రితం ఎంఎస్ ధోని నెలకొల్పిన అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 17 ఏళ్ల క్రితం ఎంఎస్ ధోని నెలకొల్పిన అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: చరిత్ర సృష్టించిన పాండ్యా.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు!

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు బ్యాటింగ్ తో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లను చితక్కొడుతూ.. 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో సూపర్ ఫిఫ్టీ సాధించాడు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల ధోని రికార్డును బద్దలు కొట్టాడు పాండ్యా. ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో టీమిండియా 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 50 రన్స్ చేయడమే కాకుండా.. ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఈ క్రమంలోనే పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు పాండ్యా. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 300 పరుగులు చేయడంతో పాటుగా.. 20+ వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్ గా పాండ్యా రికార్డుల్లోకి ఎక్కాడు. ఓవరాల్ గా ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు పాండ్యా. ఈ లిస్ట్ లో షకీబ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Hardik Pandya

ఇదిలా ఉండగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల క్రితం ధోని, రైనా(45) క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. 2007లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ లో ఎంఎస్ ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి.. 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఆ రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు హార్దిక్. మరి సూపర్ ఫామ్ లోకి రావడమే కాకుండా.. 17 ఏళ్ల క్రితం ధోని సృష్టించిన రికార్డ్ ను బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి