iDreamPost
android-app
ios-app

గిల్ ను అవమానించిన పాండ్యా.. ఆలస్యంగా సంచలన వీడియో బయటకి!

  • Published Jun 07, 2024 | 7:26 PM Updated Updated Jun 07, 2024 | 7:26 PM

Hardik Pandya-Shubman Gill: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ జరిగిన మ్యాచ్ లో ఓ షాకింగ్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శుబ్ మన్ గిల్ ను అవమానించాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Hardik Pandya-Shubman Gill: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ జరిగిన మ్యాచ్ లో ఓ షాకింగ్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శుబ్ మన్ గిల్ ను అవమానించాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గిల్ ను అవమానించిన పాండ్యా.. ఆలస్యంగా సంచలన వీడియో బయటకి!

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జూన్ 5న ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ వేదికగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది కూడా. అయితే ఎప్పుడో జరిగిపోయిన మ్యాచ్ గురించి ఇప్పుడెందుకు చెప్తున్నారు? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడికే వస్తున్నా. ఈ మ్యాచ్ కు సంబంధించి ఓ షాకింగ్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో శుబ్ మన్ గిల్ ను హార్దిక్ పాండ్యా అవమానించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? నిజంగానే గిల్ ను పాండ్యా అవమానించాడా? తెలుసుకుందాం పదండి.

టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆసల్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో శుబ్ మన్ గిల్ ను టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవమానించాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే? ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు పాండ్యా.  ఈ క్రమంలోనే అతడు వాటర్ అడగడంతో.. శుబ్ మన్ గిల్ వాటర్ బాటిల్ తెచ్చి పాండ్యాకు ఇచ్చాడు. హార్దిక్ నీళ్లు తాగిన తర్వాత బాటిల్ ను గిల్ చేతికి ఇవ్వకుండా కింద పడేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే హార్దిక్ పాండ్యా నీళ్లు తాగి బాటిల్ ను గిల్ చేతికి ఇవ్వకుండా కింద పడేయడంతో.. పాండ్యాకు తల పొగరు తగ్గలేదని, ఇంత బలుపు ఎందుకు? అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు పాండ్యాను విమర్శిస్తున్నారు. వ్యక్తులను గౌరవించడం నేర్చుకో పాండ్యా అంటూ మరికొందరు సూచిస్తున్నారు. ఇంకొందరు మాత్రం వీడియోను క్షుణ్ణంగా చూడండి.. ఇందులో పాండ్యా తప్పులేదు.. అతడిని విమర్శించకండి అంటూ రీజన్ చెప్పుకొస్తున్నారు. పాండ్యా నీళ్లు తాగిన తర్వాత గిల్ కు బాటిల్ ను ఇవ్వకుండా బౌండరీలైన్ దగ్గరే వేయడానికి కారణం.. మళ్లీ తాగుతా, ఇక్కడే ఉంచు అని చేయితో సైగ చేసి చెప్పాడు హార్దిక్. ఇది వీడియోలో స్పష్టంగా కనిస్తోంది అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత నిజంగానే గిల్ ను పాండ్యా అవమానించాడా? లేడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.