T20 World Cup 2024: సిగ్గు చేటు.. దేశం పరువు పోతోంది! ABD షాకింగ్ కామెంట్స్!

T20 World Cup 2024: సిగ్గు చేటు.. దేశం పరువు పోతోంది! ABD షాకింగ్ కామెంట్స్!

సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ పై సంచలన కామెంట్స్ చేశాడు ఆ దేశ మాజీ ప్లేయర్, దిగ్గజం ఏబీ డివిలియర్స్. మీరు చేసిన పని నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది అంటూ విమర్శించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ పై సంచలన కామెంట్స్ చేశాడు ఆ దేశ మాజీ ప్లేయర్, దిగ్గజం ఏబీ డివిలియర్స్. మీరు చేసిన పని నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది అంటూ విమర్శించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఎలాగైనా కప్ కొట్టాలని చిన్న జట్లతో పాటుగా పెద్ద టీమ్స్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ పై సంచలన కామెంట్స్ చేశాడు ఆ దేశ మాజీ ప్లేయర్, దిగ్గజం ఏబీ డివిలియర్స్. మీరు చేసిన పని నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏబీడీ ఈ రేంజ్ లో విరుచుకుపడటానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. టీమ్ ఎంపిక చేసినప్పటి నుంచి వివాదం చెలరేగింది. ఈ వివాదానికి కారణం ఏంటంటే? ప్రోటీస్ టీమ్ ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో కేవలం ఒకే ఒక్క బ్లాక్ ఆఫ్రికన్ ను సెలెక్ట్ చేశారు. కగిసో రబాడకు మాత్రమే టీమ్ లో చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా క్రికెట్ పాలసీ ప్రకారం.. సౌతాఫ్రికా ఆడే ప్రతి మ్యాచ్ లో ఇద్దరు నల్లజాతి ఆఫ్రికన్స్ ఉండాలి. కానీ ఈ నిబంధనను బోర్డ్ ఉల్లంఘించింది. రబాడకు మాత్రమే టీమ్ లో ప్లేస్ కల్పించింది.

అయితే రిజర్వ్ కోటాలో మరో బ్లాక్ ఆఫ్రికన్ అయిన లుంగీ ఎంగిడికి ఛాన్స్ ఇచ్చారు దక్షిణాఫ్రికా సెలెక్టర్లు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. సెలెక్టర్లు, బోర్డ్ పై తీరును సౌతాఫ్రికా మాజీ క్రీడా మంత్రి సైతం తప్పుబట్టారు. ఇక ఈ విషయంపై లెజెండ్ ఏబీ డివిలియర్స్ దేశం పరువు పోతుంది అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు. “ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీ ముందు ఇలాంటి నిర్ణయాలు ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. అలాగే ఇది దేశానికే అవమానం. దేశం పరువు పోతుంది. అయితే అదృష్టవశాత్తు నేను అక్కడ లేను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కాగా.. గతంలో కూడా ఇలాంటి వివాదాలు తలెత్తాయని, వరల్డ్ కప్ జట్టు అద్బుతంగా ఉందని, లుంగీ ఎంగిడి విషయంలో సెలెక్టర్లు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లు ఏబీడీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎంగిడి ఫామ్ లో లేని విషయాన్ని గుర్తుచేశాడు. కొన్ని కొన్ని సార్లు పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి ఎంపికలు జట్టులో జరుగుతూ ఉంటాయి. టీమ్ కాంబినేషన్ కు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డివిలియర్స్. మరి ఏబీడీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments